Lifestyle: పేరెంట్స్‌ విడాకులు తీసుకుంటే.. చిన్నారుల్లో ఆ ప్రాణాంతక వ్యాధి.. సంచలన విషయాలు

Parents Divorce May Lead to Brain Stroke in Kids Expert Says
x

Lifestyle: పేరెంట్స్‌ విడాకులు తీసుకుంటే.. చిన్నారుల్లో ఆ ప్రాణాంతక వ్యాధి.. సంచలన విషయాలు

Highlights

Lifestyle: విడాకులు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి. ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో అంత త్వరగా విడిపోతున్నారు.

Lifestyle: విడాకులు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి. ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో అంత త్వరగా విడిపోతున్నారు. ఆధునిక ప్రపంచంలో డైవర్స్‌ చాలా కామన్‌గా మారిపోయింది. అయితే పేరెంట్స్‌ తమ మానాన తాము విడాకులు తీసుకుంటే ఏమవుతుందిలే అనుకుంటే పొరబడినట్లే ఎందుకంటే పేరెంట్స్‌ విడాకులు తీసుకుంటే అది చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

సాధారణంగా పేరెంట్స్‌ విడిపోతే అది చిన్నారుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని తెలిసిందే. అయితే దీని వల్ల పిల్లలకు భవిష్యత్తులో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనలో భాగంగా 65 ఏళ్లకు పైబడిన 13,000 మందిని పరిగణలోకి తీసుకుని విశ్లేషించారు. విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు బ్రెయిన్‌ స్ట్రోక్ బారిన పడే అవకాశం 60 శాతం ఎక్కువగా ఉందని పరిశోధనల్లో వెల్లడైంది.

తల్లిదండ్రులు విడిపోతే.. పిల్లల్లో డిప్రెషన్, డయాబెటిస్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇవి దీర్ఘకాలంలో బ్రెయిన్‌ స్ట్రోక్ వచ్చే అవకాశం పెంచుతాయని ఈ అధ్యయనం సూచిస్తోంది. మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడాన్ని బ్రెయిన్‌ స్ట్రోక్‌గా చెబుతుంటారు. రక్తనాళం చిట్లడం లేదా మెదడుకు సరైన రక్తప్రవాహం ఉండకపోవడం ప్రధాన కారణం. ఇందులో మెదడు భాగాలు దెబ్బతింటాయి, ఇవి శాశ్వతంగా మెదడుకు నష్టం చేకూర్చుతాయి. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక వైకల్యాన్ని లేదా మరణానికి దారి తీస్తాయని అంటున్నారు.

చిన్నతనంలో శారీరకంగా లేదా మానసికంగా వేధింపులకు గురైన పిల్లలు, అలాగే విడాకులు తీసుకున్న కుటుంబాల్లో పెరిగిన వారు ఈ ఆరోగ్య సమస్యతో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని.. టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన రచయిత ఎస్మే ఫుల్లర్-థామ్సన్ తెలిపారు. అయితే తల్లిదండ్రుల విడాకుల కారణంగా బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు స్త్రీలలో, పురుషుల్లో ఒకేలా ఉండదని తెలిపారు. అలాగే.. కేవలం విడాకుల వల్ల స్ట్రోక్ వస్తుందని చెప్పడం సరికాదని.. మానసిక ఆందోళనలో మాదకద్రవ్యాలు, ధూమపానం వంటి వ్యసనాలకు అలవాటు పడడం కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు కారణమవుతుందని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories