Divorce Reason: ఈ 5 విచిత్ర కారణాలతో విడాకులు తీసుకుంటున్న జంటలు.. రీజన్లు తెలిస్తే ఆశ్చర్యపోతారంతే..!

Divorce Reason: ఈ 5 విచిత్ర కారణాలతో విడాకులు తీసుకుంటున్న జంటలు.. రీజన్లు తెలిస్తే ఆశ్చర్యపోతారంతే..!
x

Divorce Reason: ఈ 5 విచిత్ర కారణాలతో విడాకులు తీసుకుంటున్న జంటలు.. రీజన్లు తెలిస్తే ఆశ్చర్యపోతారంతే..!

Highlights

Divorce Reason: భారతీయ సమాజంలో, వివాహాన్ని పవిత్రమైన, శాశ్వతమైన బంధంగా పరిగణిస్తారు.

Divorce Reason: భారతీయ సమాజంలో, వివాహాన్ని పవిత్రమైన, శాశ్వతమైన బంధంగా పరిగణిస్తారు. కానీ, మారుతున్న కాలంతో పాటు, వివాహంలో పెరుగుతున్న సమస్యలు, వ్యక్తిత్వ వైరుధ్యాలు కూడా విడాకుల కేసులు వేగంగా పెరగడానికి దారితీస్తున్నాయి. అయితే, చాలా వరకు విడాకులు పరస్పర ఒప్పందం, వ్యక్తిగత లేదా కుటుంబ వివాదాల కారణంగా జరుగుతున్నాయి. అయితే, కొన్ని వింత కారణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇవి ఎవరినైనా ఆశ్చర్యపరుస్తాయి అననడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశంలో విడాకులకు ముఖ్యంగా 5 ప్రత్యేకమైన, షాకింగ్ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అవి వింటే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

పెళ్లయిన 40 రోజులకే ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు కోరిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నుంచి తాజాగా వెలుగులోకి వచ్చింది. తన భర్త పరిశుభ్రతపై శ్రద్ధ వహించడం లేదని, అతని శరీరం దుర్వాసన వస్తోందని మహిళ ఆరోపించింది. కుటుంబ సలహా కేంద్రంలో భర్తను విచారించగా.. తాను నెలకు ఒకటి, రెండు సార్లు మాత్రమే స్నానం చేస్తానని, వారానికి ఒకసారి గంగాజలం చల్లుతానని అంగీకరించాడు. ఈ కారణంగా కౌన్సెలింగ్ సెంటర్ వారు మళ్లీ మాట్లాడాలని సూచించినప్పటికీ, మహిళ విడాకుల కోసం దాఖలు చేసింది.

కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అతని భార్యకు బాగా వంట చేయడం తెలియదు. ఇది మాత్రమే కాదు, ఆమె ప్రతిరోజూ మ్యాగీని సిద్ధం చేసి, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం వడ్డించేదంట. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చాడు. చివరికి, ఈ జంట పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వ్యక్తి తన భార్యపై విడాకుల పిటిషన్‌ వేయడంతో మరో విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య తాంత్రికుడి సలహా మేరకు నడుస్తోందని, అతని సలహా మేరకు ఆమె రోజు లడ్డూలు మాత్రమే తినాల్సి వస్తుందని భర్త పేర్కొన్నాడు. భర్తకు ఉదయం నాలుగు లడ్డూలు, సాయంత్రం నాలుగు లడ్డూలు మాత్రమే ఇస్తుండగా, అతని భార్య ఇతర ఆహారాలు మాత్రం తిననివ్వడం లేదంట. ఈ వింత పరిస్థితితో విసిగిపోయిన భర్త వారి 10 సంవత్సరాల వివాహాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు.

ఈ ఉదంతం చాలా వింతగా అనిపిస్తుంది. అది కూడా షాకింగ్‌గా ఉంటుంది. 2020లో ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాకు చెందిన ఓ మహిళ షరియా కోర్టులో తన భర్త నుంచి విడాకుల పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని వెనుక కారణం ఏమిటంటే, ఆమె భర్త ఆమెను చాలా ప్రేమిస్తున్నాడు. ఆమెతో ఎప్పుడూ గొడవపడలేదు. తన భర్త చాలా ముద్దుగా, ప్రేమగా ఉండేవాడని, ఈ బంధంతో తాను విసిగిపోయానని మహిళ తెలిపింది. కోర్టు ఆమెకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ, ఆ మహిళ పంచాయితీలో తన వాదనను కూడా వినిపించింది.

2019లో భోపాల్‌కు చెందిన ఓ మహిళ తన భర్త నుంచి విడాకుల కోసం పిటిషన్‌ వేసింది. అందుకు కారణం తన భర్త యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ కావడంలో చాలా బిజీగా ఉండడంతో ఆమెకు సమయం ఇవ్వడం లేదంట. అతను తన భార్యతో లేదా అతని కుటుంబం లేదా బంధువులతో సమయం గడపలేకపోతున్నాడంట. భర్త ఇలా ప్రిపేర్ కావడం వల్ల దంపతుల మధ్య మనస్పర్థలు పెరిగి ఆ మహిళ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ద్వారా సమస్యను పరిష్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories