Health Tips: అలసట, ఒత్తిడి కారణంగా పురుషులు ఈ ప్రమాదంలో పడుతున్నారు..!

Men Suffer From Heart Attack due to Fatigue and Stress
x

Health Tips: అలసట, ఒత్తిడి కారణంగా పురుషులు ఈ ప్రమాదంలో పడుతున్నారు..! 

Highlights

Health Tips: అలసట, ఒత్తిడిని ఎదుర్కొనే పురుషులకి గుండె సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Health Tips: అలసట, ఒత్తిడిని ఎదుర్కొనే పురుషులకి గుండె సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలసట, ఒత్తిడి స్త్రీలను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే వీరితో పోల్చితే పురుషులకి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిలో పురుషులు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి. మగవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

1. ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా కొంతమంది అతిగా తినడం ప్రారంభిస్తారు. దీని కారణంగా వారు ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ మొదలైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

2. మీరు మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే లేదా వ్యాయామం చేయకపోతే మీరు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుకోవచ్చు.

3. మీరు మగవారైతే మీరు చాలా ఒంటరిగా ఉన్నారని భావిస్తే మీకు దగ్గరగా ఉన్న వారితో మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మీ గుండె భారం తగ్గుతుంది.

4. మీరు మరింత ఆందోళన చెందుతుంటే ఉదయాన్నే నిద్రలేచి యోగా, ధ్యానం చేయండి.

5. బయటి ఆహారాన్ని తక్కువగా తినండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి, అలసటను దూరం చేసుకోవచ్చు.

6. పురుషులు తమ మనస్సును రిలాక్స్ చేయడానికి, సమతుల్య భోజనం తినడానికి నచ్చిన పనులను చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు లోపల నుంచి సంతోషంగా ఉంటారు.

7. మగవారి మనసులో రకరకాల అంతర్మథనం జరుగుతూనే ఉంటుంది. అందుకే ఎక్కువగా కుటుంబంతో గడపడానికి ప్రయత్నించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories