Health Tips: చుండ్రు సమస్యకి బెస్ట్‌ రెమిడీ.. తక్షణ ఫలితం చూస్తారు..!

Is the Problem of Dandruff Bothering you in Winter If you Follow This tip you Will get Immediate Results
x

Health Tips: చుండ్రు సమస్యకి బెస్ట్‌ రెమిడీ.. తక్షణ ఫలితం చూస్తారు..!

Highlights

Health Tips: శీతాకాలం చాలామంది చుండ్రు సమస్యని ఎదుర్కొంటారు.

Health Tips: శీతాకాలం చాలామంది చుండ్రు సమస్యని ఎదుర్కొంటారు. నిజానికి తలలో రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనికితోడు దుమ్ము, ధూళి వల్ల చుండ్రు ప్రారంభమవుతుంది. మళ్లీ మళ్లీ తల స్నానం చేసినా చుండ్రు తగ్గకపోతే ఇబ్బంది మొదలవుతుంది. దీంతో బయటకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యను ఎదుర్కోవటానికి ఆవాల నూనె, నిమ్మకాయ రెమిడి బాగా ఉపయోగపడుతుంది. తక్షణ ఫలితాలని చూస్తారు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆవ నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాను చంపి శిరోజాలను శుభ్రపరుస్తుంది. మరోవైపు నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ లక్షణాలు ఉంటాయి. ఇది తలలో ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా చంపుతుంది. ఈ రెండింటినీ కలిపి జుట్టు మూలాలపై రాసుకుంటే అన్ని రకాల చుండ్రు తొలగిపోతుంది.

ఈ రెమెడీని ఉపయోగించడానికి ఒక గిన్నెలో ఆవాల నూనె తీసుకొని వేడి చేయాలి. తర్వాత ఇందులో 2 చుక్కల నిమ్మరసం కలపాలి. ఇప్పుడు మీ జుట్టు మూలాల్లో బాగా అప్లై చేయాలి. దాదాపు 2 గంటల తర్వాత వెంట్రుకలను సాధారణ షాంపూతో కడగాలి. తరువాత జుట్టును తనిఖీ చేస్తే మీకు చుండ్రు కనిపించదు. నిమ్మకాయ-మస్టర్డ్ ఆయిల్‌ను తలకు పట్టించడం వల్ల చుండ్రుకు మేలు చేయడమే కాకుండా తలలో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. దీంతో పాటు జుట్టు మూలాలను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. మధ్యమధ్యలో ఈ రెమెడీని చేస్తూ ఉంటే వారి జుట్టు మిగతావారికంటే భిన్నంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories