Health Tips: ఈ విటమిన్‌ లోపం తెల్లజుట్టుకి కారణం.. అందుకే డైట్‌లో ఇవి ఉండాల్సిందే..!

If you Want to Stop Gray Hair Growth Then you Should not be Deficient in B Vitamin
x

Health Tips: ఈ విటమిన్‌ లోపం తెల్లజుట్టుకి కారణం.. అందుకే డైట్‌లో ఇవి ఉండాల్సిందే..!

Highlights

Health Tips: ఈ రోజుల్లో చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది.

Health Tips: ఈ రోజుల్లో చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. దాదాపు 25 నుంచి 30 ఏళ్ల యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇది. కొన్ని సందర్భాల్లో జన్యుకారణాల వల్ల ఇది ఏర్పడుతుంది. కానీ చాలావరకు క్షీణిస్తున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు జుట్టు నెరసిపోవడానికి కారణమవుతున్నాయి. మీరు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం సహాయంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. అంతేకాదు శరీరంలో ఒక నిర్దిష్ట విటమిన్ లోపం ఉంటే జుట్టు త్వరగా తెల్లగా మారుతుంది. దీని గురించి తెలుసుకుందాం.

విటమిన్ బి లోపం

శరీరంలో విటమిన్‌ బి లోపం ఉంటే జుట్టు తెల్లగా మారడం మొదలవుతుంది. అంతేకాదు జుట్టు రాలే సమస్య కూడా ఏర్పడుతుంది. విటమిన్ బి మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకం. ఇది కణ జీవక్రియ, ఎర్ర రక్త కణాల సంశ్లేషణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. విటమిన్ B, విటమిన్ B6, విటమిన్ B12 కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవాలి. ఇవి పోషకాల అవసరాన్ని తీర్చుతాయి.

విటమిన్ బి ఆహారాలు

గుడ్లు, సోయాబీన్స్, పెరుగు, ఓట్స్ , మిల్క్ చీజ్, బ్రోకలీ, సాల్మన్, చికెన్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, తృణధాన్యాలు మొదలుగునవి తీసుకోవాలి.

విటమిన్ బి రకాలు

1. విటమిన్ B1 - థయామిన్

2. విటమిన్ B2 - రిబోఫ్లావిన్

3. విటమిన్ B3 - నియాసిన్

4. విటమిన్ B5 - పాంథోథెనిక్‌ యాసిడ్

5. విటమిన్ B7 - బయోటిన్‌

6. విటమిన్ B9 - ఫోలేట్

7. విటమిన్ B12 - కోబాల్‌మిన్‌

Show Full Article
Print Article
Next Story
More Stories