Health: చెరకు రసంలో ఇది ఒక్కటి కలిపి తాగితే దగ్గు మటుమాయం..!

if you Drink one of These in Sugarcane Juice you Will get Cough
x

Health: చెరకు రసంలో ఇది ఒక్కటి కలిపి తాగితే దగ్గు మటుమాయం..!

Highlights

Health: వేసవి కాలం రాగానే హీట్‌ స్ట్రోక్ వంటి అనేక వ్యాధులు మనపై దాడి చేస్తాయి.

Health: వేసవి కాలం రాగానే హీట్‌ స్ట్రోక్ వంటి అనేక వ్యాధులు మనపై దాడి చేస్తాయి. ఎందుకంటే ఈ సీజన్‌లో తరచుగా శరీరంలో నీటి కొరత ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో ద్రవాలు తాగడం మంచిది. మండుతున్న ఎండల నుంచి వచ్చిన వెంటనే ఏసీకి వెళ్లినా, చల్లటి నీళ్లు తాగినా దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎదురవుతాయి. వేసవిలో కఫం సమస్యను ఎలా దూరం చేసుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం. వేసవిలో ఉపశమనం పొందడానికి చాలామంది చెరుకు రసం తాగుతారు. అయితే ఈ మ్యాజిక్‌ డ్రింక్‌ని తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఎండాకాలంలో జలుబు, దగ్గు వస్తే ఒక గ్లాసు చెరుకు రసం తీసుకుని అందులో కొద్దిగా ముల్లంగి రసం కలుపుకుని తాగాలి. మీరు ప్రతిరోజూ ఈ పద్ధతిని అనుసరిస్తే మొండి దగ్గు కూడా తగ్గిపోతుంది. వేసవిలో శరీరంలో నీటి కొరత కారణంగా శక్తి తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిలో చెరకు రసం తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. మీరు రిఫ్రెష్ అనుభూతి చెందుతారు. చెరకు రసం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది శరీరం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు దీనిని తాగమని సూచిస్తారు.

చెరకు రసం తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే ఈ రసంలో ఉండే పొటాషియం పొట్టలోని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. దీనివల్ల ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. చెరకు రసం సంతానోత్పత్తికి మంచిగా పని చేసే బూస్టర్ అని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొత్తగా తల్లి అయిన వాళ్లలో పాల ఉత్పత్తిని పెంచుతుందట. ఇక మగవారిలో స్పెర్మ్ నాణ్యతని మెరుగుపరచడానికి చెరుకు రసం ఉపయోగపడుతుందట. మహిళలు పీరియడ్స్‌లో వచ్చే నొప్పికి మందుగా చెరుకు రసాన్ని వాడొచ్చని వైద్యులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories