Diabetic: మీరు డయాబెటిక్ పేషెంటా.. ఈ విషయం తెలిస్తే టెన్షన్‌ ఫ్రీ..?

If you are Diabetic Know This Tension Will be Free
x

Diabetic: మీరు డయాబెటిక్ పేషెంటా.. ఈ విషయం తెలిస్తే టెన్షన్‌ ఫ్రీ..?

Highlights

Diabetic: భారత్‌ను ప్రపంచ మధుమేహ రాజధానిగా పిలుస్తారు. అత్యధిక షుగర్‌ పేషెంట్లు మనదేశంలోనే ఉన్నారు.

Diabetic: భారత్‌ను ప్రపంచ మధుమేహ రాజధానిగా పిలుస్తారు. అత్యధిక షుగర్‌ పేషెంట్లు మనదేశంలోనే ఉన్నారు. మధుమేహం అనేది చికిత్స లేని వ్యాధి. ఒక్కసారి వస్తే జీవితాంతం బాధపడాల్సిందే. డయాబెటిస్ ఉన్న వ్యక్తి ప్రతిరోజూ చాలా చేయాల్సి ఉంటుంది. వీటిలో ఆరోగ్యకరమైన ఆహారం, సరైన వ్యాయామం చాలా ముఖ్యమైనవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఎవరికీ అంత సమయం లేదు. మధుమేహం కారణంగా రోగుల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. వైద్యపరంగా దీనిని హైపర్గ్లైసీమియా అంటారు. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి మీరు హైడ్రేటెడ్‌గా ఉండటం అవసరం. ఎక్కువ నీరు తాగడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం.

డబ్బు ఖర్చు కాకుండా, చెమట చిందించకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు అనవసరమైన బాధల గురించి చింతించకండి. ఒత్తిడికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇది కాకుండా మంచి నిద్ర రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయం చేస్తుంది. సరైన బరువు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దీని కోసం మీరు మీ ఇష్టమైన గేమ్ లేదా సాధారణ రన్నింగ్ ఎంపికను ఎంచుకోవచ్చు. ఈ విషయాలన్నీ కాకుండా మీరు ధూమపానం లేదా మద్యపాన వ్యసనానికి గురైనట్లయితే ఈ అలవాట్లను విడిచిపెట్టడమే మంచిది.

మధుమేహం లక్షణాలు

బరువు తగ్గడం, విపరీతమైన ఆకలి, దాహం, అలసట, అంత్య భాగాలలో జలదరింపు, లేదా మంట, తరచుగా ఇన్ఫెక్షన్, ఏదైనా గాయం మానడానికి చాలా సమయం పట్టడం జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే బెటర్.

Show Full Article
Print Article
Next Story
More Stories