Health Tips: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే జింక్‌ లోపం ఉన్నట్లే..!

If These Symptoms Appear in the Body it is as if There is a Zinc Deficiency
x

Health Tips: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే జింక్‌ లోపం ఉన్నట్లే..! 

Highlights

Health Tips: ఆరోగ్యకరమైన ఆహారం లేదా పోషకాల విషయానికి వస్తే ప్రజలు తరచుగా ప్రోటీన్, కాల్షియం లేదా విటమిన్ల గురించి మాట్లాడతారు.

Health Tips: ఆరోగ్యకరమైన ఆహారం లేదా పోషకాల విషయానికి వస్తే ప్రజలు తరచుగా ప్రోటీన్, కాల్షియం లేదా విటమిన్ల గురించి మాట్లాడతారు. వీటిలో జింక్ ఒకటి. ఇది ఆహారం ద్వారా లభిస్తుంది. చాలా మంది దీనిని సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటారు. జింక్ మీ శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో జింక్ లోపం ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ పరిస్థితిలో శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం.

జుట్టు రాలడం

ఒక వ్యక్తి శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. దీనివల్ల బట్టతల వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు జుట్టును కోల్పోతున్నట్లయితే శరీరంలో జింక్ లోపం ఉంటుందని గుర్తుంచుకోండి. వెంటనే ఆహారంపై శ్రద్ధ వహించండి. డైట్‌లో మార్పులు చేయండి.

సంతానోత్పత్తిపై ప్రభావం

జింక్ లోపం పురుషులకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల పురుషుల సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. మీరు తండ్రి కావాలనుకుంటే తప్పనిసరిగా జింక్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. తగినంత పరిమాణంలో జింక్ తీసుకోని పురుషులు తండ్రి కావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రోగనిరోధక శక్తి బలహీనం

శరీరానికి సంబంధించి అనేక విధులకు జింక్ అవసరమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. కానీ మీ శరీరంలో జింక్ లోపం ఉంటే అది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories