ఆహారంలోనే కంటి ఆరోగ్యం

ఆహారంలోనే కంటి ఆరోగ్యం
x
Highlights

ప్రకృతి ప్రసాదించిన అతి సుందరమైన అందాలను ఆస్వాదించగలుగుతున్నామంటే నేత్రాల పుణ్యమేనని చెప్పక తప్పుదు...కళ్లతోనే ఈ లోకిన్ని చూడగులుతున్నాము..కళ్లు మన...

ప్రకృతి ప్రసాదించిన అతి సుందరమైన అందాలను ఆస్వాదించగలుగుతున్నామంటే నేత్రాల పుణ్యమేనని చెప్పక తప్పుదు...కళ్లతోనే ఈ లోకిన్ని చూడగులుతున్నాము..కళ్లు మన శరీరంలో ముఖ్య భాగం. మరి ఈ కళ్లు ఆరోగ్యంగా ఉంటేనేగా మనకు ఆనందం..మరి అలాంటి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరమూ లేదు..నిత్యం మన రోజూ తీసుకునే ఆహారంలోనే కళ్లకు ఉపయోగపడే వాటిని తీసుకుంటూ ఉండాలి. మరి కళ్లకు ఆరోగ్యన్ని అందించే కూరగాయలు, ఆకుకూరలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

కళ్ల పేరు చెప్పగానే కూరగాయల్లో ముందుగా క్యారెట్ గుర్తుకువస్తుంది. క్యారెట్ కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. నేత్రాలకు అవసరమైన విటమిన్-ఎ, బీటాకెరొటిన్‌లు క్యారెట్‌లో లభిస్తాయి. క్యారెట్‌లో లభించే పొటాషియం, పీచుపదార్ధాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

చేపతోనూ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా చేపలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే చేపలు వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చేపలో ఉండే విటమిన్ డి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆకుకూరలను ఆహారంలో బాగం చేసుకోవడం వల్ల కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. ఇందులో ఉండే యాంటాక్సిడెంట్లు కంటి చూపును దెబ్బతిననివ్వదు. కళ్లకు వచ్చే జబ్బులను కూడా దరిచేరనీయదు.

ఆరోగ్యంతో పాటు కంటిని కాపాడుకోవాలనుకునే వారు నిత్య జీవితంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి...కంటికి కూడా కొన్న ప్రత్యేక వ్యయామాలు ఉన్నాయి. వాటిని ఆచరిస్తే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి రోజు 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉండే వస్తువులను కనుక చూస్తే కంటికి మంచి ఎక్సర్‌సైజ్ లభిస్తుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

గంటల కొద్ది సమయాన్ని టీవుల ముందు గడపడం. అర్ధరాత్రి వరకు సెల్‌ఫోన్‌లకు అతుక్కుపోవడం వల్ల ఎన్నో కంటి సమస్యలు వస్తుంటాయి. కళ్లు ఎరుపెక్కడం, దురదలు పెట్టడంతో పాటు చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. కళ్లు పొడిబారిపోవడంతో పాటు తేమను కోల్పోతాయి. అందుకూ కంప్యూటర్ల ముందు కానీ టీవీల ముందు కానీ...ఎక్కువ సేపు గడపకుండా కళ్లకు కాస్త విశ్రాంతిని అందించాలి. తద్వారా కంటిపై ఒత్తిడి తగ్గి కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories