నోటి దుర్వాసను చెక్ పెట్టండిలా..

నోటి దుర్వాసను చెక్ పెట్టండిలా..
x
Highlights

కొంత మందిలో సహజంగా నోటి దుర్వాసన వస్తుంటుంది..ఇది చాలా మందిలో సహజమైన ప్రక్రియే. ఇలా దుర్వాసన వచ్చే వారు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

కొంత మందిలో సహజంగా నోటి దుర్వాసన వస్తుంటుంది..ఇది చాలా మందిలో సహజమైన ప్రక్రియే. ఇలా దుర్వాసన వచ్చే వారు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. లేకపోతే సమాజంలో చెడ్డపేరు రావడంతో పాటు ఆత్మవిశ్వాన్ని, వ్యక్తిత్వాన్ని కొల్పోవాల్సి వస్తుంది. నోటి దుర్వాసన రావడం వల్ల మనం నలుగురుతో మాట్లాడటానికి చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాం...పక్కవారు కూడా మనతో మాట్లాడేందుకు అంతగా ఇష్టాన్ని చూపరు. ఈ సమస్యతో బాధపడేవారు మౌత్ వాష్‌లని, చూయింగ్ గమ్‌లని ఎక్కువగా తీసుకుంటుంటారు..అలా కాకుండా సహజ పద్ధతుల్లో నోటి దుర్వాసనను నివారిచుకోవచ్చు.

ముఖ్యంగా నోటి దుర్వాసన పంటి సమస్యల వల్ల వస్తుంటుంది..వీలైనంత వరకు మన నోటిని పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి రోజు ఉదయం బ్రష్ చేసిన తరువాత తప్పనిసరిగా ఉప్పు నీటితో నోటి శుభ్రంచేసుకుంటే చక్కని ఫలితం దక్కుతుంది. ఒక గ్లాసెడ్ గోరువెచ్చని నీటిలో కళ్లుప్పు వేసుకుని కలిపి దానిని రోజులో రెండు మూడు సార్లైనా పుక్కిలించాలి .అదీ ఆహారం తీసుకున్న తరువాత..ఇలా చేయడం వల్ల నోట్లో ఏదైనా ఆహారం మిగిలిపోయినా...నోరు శుభ్రం అవుతుంది...అంతేకాదు నోటి దుర్వాసన దూరం కావడంతో పాటు చిగుర్ల సమస్యను మటుమాయం అవుతాయి.

బ్రష్‌ చేయడానికి ఇంటి పేస్ట్‌నే వినియోగించడంది..దీనిని ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి పసుపు, కాస్త ఉప్పు, అందులో నువ్వుల నూను వేసి పేస్టులా చేసుకుని ఈ పేస్ట్‌తో పళ్లను తోమాలి. తద్దవారా పంటి సమస్యలు తీరడంతో పాటు నోటి దుర్వాసన తగ్గుతుంది. ఔషధగుణాలున్న నిమ్మరసంతో బ్రష్‌ చేయడం వల్ల దుర్వాసనను తగ్గించుకోవచ్చు.

రోజులో రెండు సార్లు బ్రష్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. టూత్‌ బ్రష్‌లను రెండు మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. నోట్లోని చెడు వాసనకు కారణమైన బ్యాక్టీరియాను తరిమేందుకు సహజసిద్ధమైన మౌత్‌ వాష్‌లను వినియోగించండి . బ్రష్ చేయడంతో పాటు నాలుకను టంగ్ క్లీనర్‌తో చాలా శుభ్రంగా కడగాలి. ఉల్లి , వెల్లుల్లి తో తయారు చేసిన వంటకాలకు దూరంగా ఉంటూనే మంచిది. మరీ ముఖ్యంగా సిగరేట్‌ వినియోగానికి దూరం కావాల్సి ఉంటుంది. రోజులో కనీసం రెండు మూడు లవంగాలు, సోంపు వంటివి తింటుండాలి...ఇందులో ఉండే మంచి లక్షణాలు నోట్లోని బ్యాక్టీరియాను దూరం చేస్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories