Top
logo

ఇలా చేస్తే 80 ఏళ్ళ పాటు బతకొచ్చట..

ఇలా చేస్తే 80 ఏళ్ళ పాటు బతకొచ్చట..
X
Highlights

ఆరోగ్యమే మహాభాగ్యం..ప్రతి ఒకరి మెుదటి ప్రాధన్యత దానికే. ఆరోగ్యం బాగుంటేనే మనిషి మనగడ కొనసాగుతుంది. అయితే ...

ఆరోగ్యమే మహాభాగ్యం..ప్రతి ఒకరి మెుదటి ప్రాధన్యత దానికే. ఆరోగ్యం బాగుంటేనే మనిషి మనగడ కొనసాగుతుంది. అయితే సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించడానికి పలు ఆరోగ్యపరమైన నియమాలను పాటించాలి. శరీరానికి సరైన శ్రమ లేనప్పుడు మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య గుండె సంబందించిన వ్యాధులే. ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే ప్రతి రోజూ గంటపాటు వ్యాయామం చేయడం మంచిది.రోజూ

వ్యాయామం చేయడం వల్ల 80నుంచి 90 సంవత్సరాలు జీవించే అవకాశముందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మరి ముఖ్యంగా స్త్రీలు ఉదయం లేచి వ్యాయమం చేస్తే ఆయుస్సు పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే పురుషులు గంటకు మించి రోజు వ్యాయమం చేస్తే వారు నూరేళ్ళు జీవించడం ఖాయమని రిసెర్చ్‌లో తేలింద 22 సంవత్పరాల పాటు దాదాపు ఎనిమిది వేల మంది స్త్రీ పురుషులపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఉదయం వాకింగ్ చేయడం ద్వారా

ఫిట్‌నెస్‌ను పెంచుకోవచ్చని, అలాగే రోజాంత ఉల్లాసంగా కనిపించడంతో పాటు ఆయిష్షు పెంచుకోవచ్చని అధ్యయనంలో తేల్చింది. ఉదయం పరిగెత్తవారు దాదాపు మూడెళ్ళ పాటు అదనంగా జీవిస్తారని ఇలా గంట పాటు అన్నీ వ్యాయమాలు చేస్తే కొన్ని ఏళ్ళపాటు జీవిత కాలం పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అధిక బరువు, పోగ త్రాగే అలవాటు ఉన్నవారు జాయింగ్ చేయడం ద్వారా లైఫ్ స్పాన్‌ను పెంచుకోవచ్చని వైద్యలు తెలిపారు. మనిషి జీవిత కాలం పెరగలంటే దాదాపు 60 నిమిషాల పాటు వ్యాయమం చేయడంతో ఆరోగ్యంగా ఉండవచ్చని డాక్టర్స్ సూచిస్తున్నారు. వారంలో ఐదారుసార్లయినా వ్యాయమం చేస్తే గుండె సంబంధిత వ్యాధులు ఆమడదూరంలో ఉండవచ్చని నిపుణులు తెలిపారు. అలాగే డైట్‌లో షోషకాహరం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. వ్యాయామంలో అలసట రాకుండా ఉండాలంటే ఫైబర్ అధికంగా ఉండే కొవ్వు తక్కువగా వుండే పదార్థాలు ఆహారంగా తీసుకోవాలని తెలిపారు.

Next Story