దగ్గు, జలుబును తగ్గించే ఇంటి చిట్కాలు

దగ్గు, జలుబును తగ్గించే ఇంటి చిట్కాలు
x
Highlights

చలికాలం వచ్చిందంటే చాలు పిలవని అతిథులుగా జలుబు దగ్గు సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. వేరే ఏకాలంలో అయినా ఫరవాలేదు కానీ...ఈ సీజన్‌లో మాత్రం వీటిని తట్టుకోవడం కాస్త ఇబ్బందే..ఒకవైపు పొగమంచు, మరో వైపు చలి.

చలికాలం వచ్చిందంటే చాలు పిలవని అతిథులుగా జలుబు దగ్గు సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. వేరే ఏకాలంలో అయినా ఫరవాలేదు కానీ...ఈ సీజన్‌లో మాత్రం వీటిని తట్టుకోవడం కాస్త ఇబ్బందే..ఒకవైపు పొగమంచు, మరో వైపు చలి. వీటి ప్రభావంతో చాలా చికాకుగా ఉంటుంది. ఎంత మంది డాక్టర్ల దగ్గరకు వెళ్లినా...ఎన్ని మందులు వాడినా..ప్రయోజనం ఉండదు...ఈ సమస్య వేధిస్తూనే ఉంటుంది. కాబట్టి కాస్త పెరటి వైద్యంతో పాటు రోజూవారీ కాస్త జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

అల్లం ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పక పదార్ధం. దీని రసం తాగడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. అల్లాన్ని మంచిగా దంచి, ఎంత అల్లం రసం వస్తుందో దాని సమానంగా తేనెను కలుపుకుని ఆ రసాన్ని తాగాలి. అలా తాగడం ఇష్టం లేనివారు పాలల్లో కలుపుకుని కూడా తాగవచ్చు. ఈ అల్లం రసం జలుబు, దగ్గును వెంటనే మాయం చేయడంతో పాటు గొంతు నొప్పిని తగ్గిస్తుంది.

ఇక ఇంట్లో లభించే సహజసిద్ధమైన మెడిసిన్ పసుపు. ఇది యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. రాత్రి పడుకునే సమయంలో పసుపును వేడివేడి పాలల్లో వేసుకుని తాగితే...జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉదయం పూట మిరియాలను బాగా దంచి పాలల్లో మరిగించి తాగినా జలుబు తగ్గుతుంది.

తులసి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. తులసి ఆకుల రసాన్ని గనుక రోజుకు మూడు సార్లు తీసుకుంటే జలుబు , దగ్గు హాంఫట్ అవ్వాల్సిందే. దానిమ్మ పండ్లు కూడా దగ్గును నియంత్రించేందుకు బాగా పనిచేస్తుంది. దానిమ్మ గింజల రసాన్ని తీసుకుని అందులో అల్లం రసం తేనెను కలిపి మూడు పూటలు తాగాలి. ఇలా చేస్తే దగ్గు మటుమాయం అవుతుంది.

చిన్న పిల్లలకు జలుబు, దగ్గు చేస్తే కచ్చితంగా గింతునొప్పి వస్తుంది.దీని నుంచి ఉపశమనం పొందాలంటే , ఉప్పును గ్లాసెడు కాచిన నీటిలో వేసి ఉకిలించాలి. ఇలా చేస్తే దగ్గు దూరమవుతుంది.వేడి నీటితో ఆవరి పట్టించినా ఫలితం ఉంటుంది. అలాగే రోజుకు మూడు సార్లు తేనెను తీసుకోవడం పిల్లలు అలవాటు చేస్తే వారిలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

చిన్నపిల్లలు జలుబు ,దగ్గు వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు.వీలైనంతగా వారిని చలిలో తిరుగకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు ఉన్ని దుస్తులనే వేయాలి. స్వీట్స్, చల్లటి పదార్ధాలు తినకుండా జాగ్రత్తపడాలి. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి జలుబు, దగ్గు వచ్చిన తరువాత బాధపడేకంటే ముందే జాగ్రత్తపడటం ఉత్తమం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories