టైంకి ఇది చేస్తే... ఇట్టే తగ్గిపోతారు..

టైంకి ఇది చేస్తే... ఇట్టే తగ్గిపోతారు..
x
Highlights

ఆధునిక యుగంలో అన్నీ మారుతున్నాయి... జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లులో మార్పులు కనిపిస్తున్నాయి. తద్వారా శరీరంలోనూ విపరీతమైన మార్పులు వస్తున్నాయి.....

ఆధునిక యుగంలో అన్నీ మారుతున్నాయి... జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లులో మార్పులు కనిపిస్తున్నాయి. తద్వారా శరీరంలోనూ విపరీతమైన మార్పులు వస్తున్నాయి.. ప్రధానంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇందుకు చిన్నా పెద్దా అన్న తారతమ్యం లేదు.. ధనిక పేద అన్న బేధం లేదు... ఇప్పడు ఈ సమస్య అందరినీ వేధిస్తోంది.. ఒక్కసారి బరువు పెరిగితే దాని వల్ల వచ్చే సమస్యలతో విసుగెత్తిపోతాము.. శరీరం అదుపుతప్పుతుంది. అలసట పెరుగుతుంది.. మన పని మనమే చేసుకోలేని దయనీయ పరిస్థితి వస్తుంది... ఒకసారి బరువు పెరిగితే దాన్ని నియంత్రిచడం చాలా కష్టం. బరువు పెరిగిన తరువాత వ్యాయామాలు చేసిన ఫలితం ఉండదు.. కొవ్వును తగ్గించేందుకు ఆహారాన్ని మానేయడం , వంటివి చేస్తుంటారు... ఇలాంటి వారికి చక్కటి పరిష్కారం ఒకే ఒక్క చిన్న చిట్కాతో తీరుతుంది..

అదే సమయానికి ఎలాంటి శ్రమ లేకుండా హాయిగా కూర్చిని భోజనం చేయడం. ప్రతి రోజూ క్రమంగా ఒకేసమయానికి తినడం వల్ల ఎలాంటి శ్రమ లేకుండా హాయిగా బరువును తగ్గించుకోవచ్చు. ఉదయం లేవగానే కాలకృత్యాలన్నీ తీర్చుకుని 8 గంటల ఉంచి ఎనిమిదిన్నర గంటల లోపు అల్పాహారాన్ని ముగించేయాలి...తరువాత మళ్లీ రాత్ర ఎడున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల కల్లా భోజనాన్ని తినేయ్యాలి.. కచ్చితంగా బ్రేక్‌పాస్ట్‌కి రాత్రి భోజనానికి మధ్య 12 గంటల నుంచి 13 గంటల గ్యాప్ ఉండాలి. ఇలా చేయడం వల్ల చక్కగా బరువును తగ్గించుకోవచ్చు. పైగా ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇలా సమయానికి తినడం, సమయాన్ని నిద్రపోవడం వల్ల శరీరం మన అదుపులోకి వస్తుంది.

మనం తీసుకునే ఆహారానికి ఆరోగ్యానికి చాలా సంబంధం ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమయానుకూలంగా తీసుకుంటూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని సాగించవచ్చు.. కానీ మనం చేసే ఉద్యోగం రిత్యనో మారుతున్న అలవాట్ల రిత్యనో ఆహారంలో అనేక మార్పులు వస్తున్నాయి.. ఇక కార్యాలయాల్లో రాత్రి వేళల్లో ఉద్యోగం చేసేవారి లైఫ్‌స్టైల్ పూర్తిగా మారిపోతుంది... ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు.ముఖ్యంగా రాత్రంతా మేల్కొనడం వల్ల ఏదో ఒకటి తింటూనే ఉంటారు.. ఇలాంటి వారు తొందరగా ఒళ్లు చేస్తారు. పగలు , రాత్రి తేడా తెలియకుండా తింటూ ఉంటూ ఎవరైనా ఒళ్లు చేస్తారు. వీరు సమయానుకూలంగా ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు అంతే కాదు.. టైం కి తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories