ఈ ఆహారాలలో విటమిన్‌ E పుష్కలం..! కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..

Health Tips these 5 Foods are High in Vitamin E
x

విటమిన్ ఈ కోసం తీసుకోవలసిన ఆహారం (ఫైల్ ఇమేజ్)

Highlights

Vitamin E: శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి వర్కవుట్లు చేయడమే కాదు మంచి ఆహారం కూడా తీసుకోవాలి.

Vitamin E: శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి వర్కవుట్లు చేయడమే కాదు మంచి ఆహారం కూడా తీసుకోవాలి. అంతేకాదు ఫిట్‌నెస్ కోసం అనేక విటమిన్లు, ఖనిజాలు అవసరం. విటమిన్ E ఎల్లప్పుడూ శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది లేకపోతే చర్మం, జుట్టు సమస్యలు అధికంగా వస్తాయి. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఈ చేర్చుకుంటే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. విటమిన్ ఈ లోపం వల్ల శరీరంలోని కండరాలలో నొప్పి, బలహీనత కూడా వస్తాయి. విటమిన్ ఈ పుష్కలంగా ఉన్న కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. బ్రోకలీ

బ్రోకలీ ఎల్లప్పుడూ ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రోకలీని సలాడ్‌గా లేదా వెజిటేబుల్‌గా తీసుకోవచ్చు. విటమిన్ ఈ ఇందులో తగినంత మొత్తంలో లభిస్తుంది.

2. బొప్పాయి

బొప్పాయి తినడం బరువు తగ్గడానికి ఉత్తమమైనది. నిజానికి విటమిన్ ఈ లక్షణాలు బొప్పాయిలో అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తాయి.

3. వేరుశెనగ

సాధారణంగా శీతాకాలంలో వేరుశెనగకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ వేరుశెనగ విటమిన్ ఈ ఉత్తమ వనరు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండవచ్చు.

4. ఆలివ్‌

ఆలివ్స్‌లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్ ఇ లోపాన్ని అధిగమించవచ్చు. ఆలివ్ ఆయిల్ అనేక వ్యాధులను కూడా నయం చేస్తుంది.

5. అవకాడో

అవోకాడో అనేది పోషకాల నిల్వగా ఉండే పండు. ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. అవోకాడోలో విటమిన్-సి కూడా ఉంటుంది, మీరు దీన్ని ఆహారంలో చేర్చుకుంటే చర్మాన్ని, శరీరాన్ని ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories