Health Tips: రాత్రిపూట పొరపాటున కూడా వీటిని తినవద్దు..!

Health Tips do not eat These Foods at Night
x

Health Tips: రాత్రిపూట పొరపాటున కూడా వీటిని తినవద్దు..!

Highlights

Health Tips: ఉదయాన్నే పరగడుపున ఆరోగ్యకరమైన ఆహారాలు తిన్నట్లే రాత్రిపూట కూడా సరైన ఆహారపదార్థాలని డైట్‌లో ఉండేట్లు చూసుకోవాలి.

Health Tips: ఉదయాన్నే పరగడుపున ఆరోగ్యకరమైన ఆహారాలు తిన్నట్లే రాత్రిపూట కూడా సరైన ఆహారపదార్థాలని డైట్‌లో ఉండేట్లు చూసుకోవాలి. అప్పుడే జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉంటుంది. కానీ చాలామంది రాత్రిపూట హెవీ ఫుడ్స్‌ తీసుకొని ఇబ్బందిపడుతుంటారు. అది జీర్ణవ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. నిద్రలేమి, మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలని తీసుకొస్తుంది. రాత్రిపూట కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.

1. హెవీ ఫుడ్స్

రాత్రిపూట భారీ ఆహారాలు తినడం మంచిది కాదు. వీటిని తినడం వల్ల కడుపులో భారంగా ఉంటుంది. దీని వల్ల గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఏర్పడుతాయి. అందుకే రాత్రిపూట చీజ్ మేడ్ వస్తువులు, బర్గర్లు, పిజ్జా వంటివి తినకుండా ఉండాలి. ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది.

2. మద్యం

చాలా మంది రాత్రి సమయంలో మద్యం సేవిస్తారు. ఇది ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ నిద్రకు భంగం కలిగిస్తుంది. కాబట్టి రాత్రిపూట మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి.

3. స్పైసీ ఫుడ్

రాత్రిపూట స్పైసీ ఫుడ్ తినడం మానుకోవాలి. స్పైసీ ఫుడ్ నిద్రకు, జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే రాత్రిపూట స్పైసీ ఫుడ్ తక్కువగా తినాలి.

4. గ్యాస్‌ పదార్థాలు

గ్యాస్‌ను తయారు చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి. రాత్రిపూట అలాంటి ఆహార పదార్థాలను జీర్ణం చేయడం కష్టం. పీచు ఎక్కువగా ఉండేవి గ్యాస్‌కు కారణమవుతాయి. కాబట్టి రాత్రిపూట డ్రై ఫ్రూట్స్, బీన్స్, బ్రకోలీ, క్యాలీఫ్లవర్, మొలకలు వంటి వాటిని తినకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories