Beta Carotene: శరీరానికి బీటా కెరోటిన్ అవసరం.. లేదంటే చాలా సమస్యలు..!

Health Tips Benefits of Beta Carotene
x

Beta Carotene: శరీరానికి బీటా కెరోటిన్ అవసరం.. లేదంటే చాలా సమస్యలు..!

Highlights

Beta Carotene: శరీరానికి ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు మొదలైన అనేక పోషకాలు అవసరం. అదే విధంగా శరీరానికి బీటా కెరోటిన్ కూడా అవసరమే.

Beta Carotene: శరీరానికి ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు మొదలైన అనేక పోషకాలు అవసరం. అదే విధంగా శరీరానికి బీటా కెరోటిన్ కూడా అవసరమే. ఇతర పోషకాల మాదిరిగానే బీటా కెరోటిన్ కూడా శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం మొదలైన వాటి అవసరాల గురించి ప్రజలకు తెలుసు. కానీ బీటా కెరోటిన్ అవసరం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే శరీరం ఎలా నష్టపోతుందో అదే విధంగా బీటా కెరోటిన్ లేకపోవడం వల్ల కూడా జరుగుతుంది. ఈ పరిస్థితిలో బీటా కెరోటిన్ ఎలాంటి సమస్యలను దూరం చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం.

1. కళ్లలో చికాకును తొలగిస్తుంది.

వేసవి కాలంలో ప్రజలు తరచుగా కళ్లలో మంటను ఎదుర్కొంటారు. బీటా కెరోటిన్ తక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. వెంటనే బీటా కెరోటిన్ దొరికే ఆహారాలు తింటే సమస్య పరిష్కారమవుతుంది. లేదంటే డాక్టర్‌ని సంప్రదించాల్సిందే.

2. చర్మం, జుట్టుకి మేలు చేస్తుంది

వేసవిలో చర్మంపై మచ్చలు, టానింగ్, ముడతలు మొదలవుతాయి. దీనికి ప్రధాన కారణం వేడి, సూర్యకాంతి. వాస్తవానికి UV కిరణాల కారణంగా చర్మంపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. దీనివల్ల చర్మం క్రమంగా క్షీణిస్తుంది. ఈ పరిస్థితిలో బీటా కెరోటిన్ ఆహారాలు ఈ సమస్యలన్నింటినీ తొలగిస్తాయి.

3. వ్యాధులకి దూరంగా ఉంచుతుంది

నిజానికి యాంటీ-ఆక్సిడెంట్లు బీటా కెరోటిన్ ఫుడ్స్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక సమస్యల నుంచి కాపాడుతాయి. బీటా కెరోటిన్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. బీటా కెరోటిన్ అధికంగా ఉండే ఆహారాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే సమస్యలను దూరం చేస్తాయి.

4. బీటా కెరోటిన్ కోసం మీరు బంగాళాదుంపలు, క్యాబేజీ, మిరియాలు, బచ్చలికూర, క్యారెట్లు, బొప్పాయిలు, టమోటాలు, చిలగడ దుంపలు, గుమ్మడికాయ వంటి ఆహారాలను తినాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories