ఙ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే ఇవి తినాల్సిందే..

ఙ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే ఇవి తినాల్సిందే..
x
Highlights

ప్రపంచంలోనే అతి పురాతనమైన గింజలలో పిస్తాపప్పులు ఒకటి. ఇవి చిరుతిళ్లగానే కాదు.

ప్రపంచంలోనే అతి పురాతనమైన గింజలలో పిస్తాపప్పులు ఒకటి. ఇవి చిరుతిళ్లగానే కాదు.. పోషకాలు పుష్కలంగా ఇందులో లభిస్తాయి. ఇందులో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తరచుగా పిస్తీలను తీసుకోవడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఇందులో ఉండే పిండి పదార్ధాలు స్థూలకాన్ని నివారించేందుకు చక్కగా పనిచేస్తాయి. రకరకాల తినుబండాల్లో పిస్తాలను వినియోగిస్తుంటారు.. అదనపు రుచిని అందిస్తుంటారు. పిస్తాలు బలమైన ఆహార గింజలు.

ఇందులో విటమిన్-ఇ, కెరోటిన్‌ , ఫైటోకెమికల్స్ తో పాటు బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. కాపర్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కొవ్వు శాతం తక్కువగా ఉండే ఆహార గింజలు పిస్తా. అందుకే పిస్తాలను తినడం వల్ల శరీరంలోని చెడు కొవ్వులను తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా నట్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది..కానీ పిస్తాలో ఆ సమస్య లేదు. ఎక్కువగా తిన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. పిస్తా పప్పులను షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకుంటూ ఆరోగ్యానికి మంచి చేస్తుంది. పిస్తాలు శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి గ్లూకోజ్ స్తాయిలను తగ్గిస్తాయని వైద్యుల మాట.

ఈ మధ్యకాలంలో చాలా మంది మతిమరుపు సమస్యతో సతమతమవుతున్నారు. ఈ సమస్యకు చెక్ చెప్పి ఙ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే... మాత్రం ప్రతి రోజు పిస్తాలను తప్పనిసరిగా తినాలంటున్నారు. ఇవి మెదడుఆరోగ్యానికి సహాయపడతాయి. పిస్తాలో ఉండే ల్యూటిన్ మేధాశక్తి పనితీరును మెరుగుపరుస్తుంది.

పిస్తాలోని విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను చక్కగా పని చేసేలా చేస్తాయి. ఇవి శరీరంలో సక్రమంగా సరైన రక్త సరఫరాకు ఇవి సహాయపడతాయి. పిస్తాలో ఉండే విటమిన్ ఇ చర్మంలో త్వరగా వృధ్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. యవ్వనమైన చర్మాన్ని అందిస్తాయి. ఇక పిస్తా ఆయిల్స్ సహజ మాయిశ్చరైజర్‌గా పని చేస్తాయి. పిస్తాలో ఉండే కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన పొడవాటి జుట్టును కలిగేందుకు తోడ్పడతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories