Health Tips: బొప్పాయితో బోలెడంత ఆరోగ్యం..

Health Tips: బొప్పాయితో బోలెడంత ఆరోగ్యం..
x
Highlights

మన పెరట్లో లభించే పండ్ల చెట్లలో బొప్పాయి చెట్టు ఒకటి..పల్లెటూర్లలో ఇంటికో చెట్టు మనకు దర్శనమిస్తుంది.

మన పెరట్లో లభించే పండ్ల చెట్లలో బొప్పాయి చెట్టు ఒకటి..పల్లెటూర్లలో ఇంటికో చెట్టు మనకు దర్శనమిస్తుంది...కేలవం అలంకరణకే కాదు... బొప్పాయితో బోలెడంత ఆరోగ్యం అని అంటున్నారు...వైద్యులు. నిజమే బొప్పాయిలో ఉండే పోషకాలు అలాంటివి మరి..ఈ పండ్లును రోజూ తీసుకోవడం వల్ల నిత్య ఆరోగ్యం మనం పొందవచ్చు. బొప్పాయిలో మానవ శరీరానికి అవసరమయ్యే విటమిన్ల, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

మన శరీరంలోని చాలా జబ్బులు ఉదరం నుంచి సంభవిస్తాయి. మరి ఈ జబ్బులను నియంత్రించేందుకు బొప్పాయినీ తరుచుగా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.చిన్న నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు నిస్సందేహంగా ఈ పండను ఆరగించవచ్చిన సూచిస్తున్నారు. ఈ పండులో క్యాలరీలు కూడా తక్కువ మోతాదులో ఉన్నాయి కాబట్టి అధిక బరువుతో బాధపడేవారు సైతం బొప్పాయిని హాయిగా తినొచ్చు. ముఖ్యంగా బొప్పాయిలో ఉండే బిటాకెరోటిన్ కంటికి సంబంధించిన వ్యాధులను నియంత్రించేందుకు పనిచేస్తాయి. అలాగే దంత సంబధమైన చిన్న చిన్న సమస్యలను తరిమికొడుతుంది.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది. పండిన పండే కాదు...పచ్చికాయ తిన్నా ఆరోగ్యమే... పచ్చి బొప్పాయిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుని నియంత్రించవచ్చు. చర్మ సౌందర్యానికి బొప్పాయి బాగా పనిచేస్తుంది. చర్మం నిగనిగలా మెరిసేందుకు బిప్పాయి పండు లోప ల ఉండే తెల్లని గుజ్జుని ముఖానికి పట్టించాలి.. దీని వల్ల ఛర్మం మెరవడంతో పాటు మొటిమల సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. బొప్పాయి తీసుకోవడం వల్ల కొలెన్, గర్భాశయ క్యాన్సర్‌లను సైతం తరిమికొట్టవచ్చంటున్నారు నిపుణులు.

బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుంతో...దీనిని అధికంగా తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి అని నిపుణుల హెచ్చరిక. ఆరోగ్యానికి మంచిది కదా అని ఇష్టానుసారంగా బొప్పాయిన తీసుకుంటే ఇందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల చర్మం రంగు మారుతుంది. అదే విధంగా కళ్లు తెల్లగా కూడా మారుతాయంటా... చేతులు పచ్చ రంగులోకి మారుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చ కామెర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. గర్భినీ స్త్రీలు అస్సలు ఈ బొప్పాయిని తీసుకోకూడదు.

శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారు ఈ పండును తినకూడదు. ఒకవేళ తీసుకుంటే ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. మితిమీరి బొప్పాయిని తింటే వీర్యకణాలపైనా ప్రభావం చూపవచ్చంటున్నారు పరిశోధకులు. షుగర్ వ్యాధిగ్రస్తుతలు తురుచుగా బొప్పాయి తీసుకుంటుంటారు..అయితే అతిగా ఈ పండును తింటే షుగర్ లెవల్స్ దారుణంగా పడిపోవచ్చునని.. కొందరు తక్కువ షుగర్ లెవల్స్‌తో ఇబ్బంది పడవచ్చని అంటున్నారు.

అతిగా బొప్పాయి తినడం వల్ల శరీరంపై తెల్ల, పసుపు మచ్చలు వస్తాయి...ఇప్పటికే ఈ సమస్య ఉంటే బొప్పాయి తీసుకోవడం వెంటనే మానెయ్యాలి. వీటితో పాటు గ్యాస్ సమస్యలు కూడా వస్తాయంటున్నారు వైద్యులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories