Coriander: కొత్తిమీర జ్యూస్‌తో ఎన్ని లాభాలో.. తెలిస్తే అస్సలే వదలరు

Health Benefits With Coriander Juice
x

Coriander: కొత్తిమీర జ్యూస్‌తో ఎన్ని లాభాలో.. తెలిస్తే అస్సలే వదలరు

Highlights

Coriander: దాదాపు ప్రతీ ఒక్క వంటకంలో కచ్చితంగా ఉపయోగించే వాటిలో కొత్తిమీర ఒకటి. వంట అంతా పూర్తయ్యాక కచ్చితంగా కొంత కొత్తిమీరను చల్లుతారు.

Coriander: దాదాపు ప్రతీ ఒక్క వంటకంలో కచ్చితంగా ఉపయోగించే వాటిలో కొత్తిమీర ఒకటి. వంట అంతా పూర్తయ్యాక కచ్చితంగా కొంత కొత్తిమీరను చల్లుతారు. అయితే కేవలం కూరకు రుచిని అందించడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే కొత్తమీరను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని అంటున్నారు. అయితే కొత్తిమీరను జ్యూస్‌ రూపంలో తీసుకుంటే మరెన్నో ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా? ఇంతకీ కొత్తమీరను జ్యూస్‌ రూపంలో తీసుకుంటే జరిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కొత్తిమీర జ్యూస్‌ బాగా పనిచేస్తుంది. ఈ జ్యూస్‌ శరీరంలో చెడు కాలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంతో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కూడా కొత్తిమీర ఉపయోగపడుతుంది. కొత్తిమీర జ్యూస్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే మొటిమలతో పాటు ఇతర చర్మ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

కొత్తిమీరలో ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. అందుకే కొత్తిమీర జ్యూస్‌ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. మలబద్ధకం, గ్యాస్‌, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు ఈ జ్యూస్‌ను తీసుకుంటే వెంటనే ఫలితం ఉంటుంది. కొత్తిమీరలోని విటమిన్‌సి, యాంటీ ఆక్సిడెంట్స్‌ రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. డయాబెటిస్‌ పేషెంట్స్‌కి కూడా కొత్తిమీర జ్యూస్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. జ్యూస్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే డయాబెటిస్‌ సమస్య దూరమవుతుంది.

అయితే కొత్తిమీర జ్యూస్‌తో లాభాలు ఉన్నట్లే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధఫడేవారు దీనికి దూరంగా ఉండడమే మంచిది. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కొత్తమీర జ్యూస్‌ తీసుకోకూడదు. దీనిలోని రసాయనాలు, శిశువు ఎదుగదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రక్తం పలుచబడే మందులను ఉపయోగించే వారు, దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండే వారు కూడా ఈ జ్యూస్‌కు దూరంగా ఉండడమే ఉత్తమం అని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories