Health Benefits with Bitter Gourd: చేదుగా ఉన్నా ఆరోగ్యానికి వరమే..

Health Benefits with Bitter Gourd: చేదుగా ఉన్నా ఆరోగ్యానికి వరమే..
x

Bitter Gourd

Highlights

Health Benefits with Bitter Gourd| కాకరకాయ (Bitter gourd) ఇండియా అంతా పెంచబడుతున్న ఓ చేదు తీగ జాతి మొక్క.

Health Benefits with Bitter Gourd| కాకరకాయ (Bitter gourd) ఇండియా అంతా పెంచబడుతున్న ఓ చేదు తీగ జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం మొమోర్డికా కరన్షియా (Momordica charantia). ఇది కుకుర్బిటేసి (Cucurbitaceae) కుటుంబానికి చెందినది. ఆరోగ్యాన్ని ఇచ్చే కాకర చేదు అయినప్పటికీ మధుమేహానికి మందు గావాడుతున్నారు.

కాకరకాయ, కాకరకాయ రసము, కాకరకాయ ఆకులు మందుగా ఉపయోగ పడతాయి. కాకర రసములో "హైపోగ్లసమిక్" పదార్ధము ఇన్‌సులిన్‌ స్థాయిలో తేడారాకుండా నియంత్రణ చేస్తూ రక్తం లోని చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాకరకాయ గింజలలలో రక్తములో గ్లూకోజ్ ను తగ్గించే "చారన్‌టిన్‌" అనే ఇన్సులిన్‌ వంటి పదార్ధము ఉంటుంది.

కాకరకాయ రకాలు...

* నల్ల కాకరకాయ

* తెల్ల కాకరకాయ

* బారామాసి కాకరకాయ

* పొట్టికాకర

* బోడ కాకరకాయ

కాకరకాయ రసము వలన లాభాలు...

స్వభావం చేదైనా కమ్మని రుచులను అందించే కూరగాయ కాకరకాయ. కొంతమందికి కాకరకాయ వాసనంటేనే పడదు. కానీ కొందరు మాత్రం ఇష్టంగా తింటుంటారు. ఈ విషయం తెలిస్తే కాకరకాయ తినే అలవాటు లేకపోయినా కొత్తగా తినాలని చాలామంది అనుకుంటారేమో. కాకరగాయ వల్ల అనేక లాభాలున్నాయి.

* వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఎన్నో ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు.

* శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం: కాకరగాయ తినడం వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ లక్షణాలతో బాధపడేవారు కాకరగాయ రసం తాగితే మరింత మంచిది.

* రక్త శుద్ధి, కాలినగాయాల పరిష్కారం: రక్తాన్ని శుద్ధి చేయడంలో కాకరగాయ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు, కాలినగాయాలు, పుండ్లను మాన్పడంలో కూడా కాకరగాయ చక్కగా పనిచేస్తుంది.

* అందమైన శరీరాకృతి కోరుకునే వారు, బరువు తగ్గాలనుకునేవారు చేదుగా ఉన్నా కాకరగాయ రసం తాగాల్సిందే. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి.

* కంటి సమస్యలను తగ్గిస్తుంది.

* ఉదర సమస్యలకు, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసానికి మించిన సంజీవని లేదు.

* గుండెపోటుకు ఒక కారణం కొలెస్ట్రాల్. శరీరంలో కొవ్వు శాతాన్ని అదుపులో ఉంచి, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో కాకరకాయ ప్రధాన భూమిక పోషిస్తుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories