Snake Fruit: అరుదుగా కనిపించే ఈ పండుతో అద్భుతమైన లాభాలు


Health Benefits of snake fruits in Telugu: మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు ఈ ప్రపంచం. తినే ఆహారంలోనూ ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. మనకు తెలియని...
Health Benefits of snake fruits in Telugu: మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు ఈ ప్రపంచం. తినే ఆహారంలోనూ ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. మనకు తెలియని పండ్ల రకాలు ఎన్నో. అలాంటి వాటిలో స్నేక్ ఫ్రూట్ ఒకటి. ఇండోనేషియాలోని బాలి, లాంబాక్, తైమూర్ దీవులలో ప్రత్యేకంగా ఈ పండ్లను సాగు చేస్తున్నారు. అయితే ఈ పండ్లు విరివిగా లభించకపోయినా.. కొన్ని సూపర్ మార్కెట్స్‌లో మాత్రం లభిస్తున్నాయి.
అచ్చంగా లిచీ పండు ఆకారాన్ని పోలి ఉండే ఈ పండుతో ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పండు పైభాగం అచ్చంగా పామును పోలి ఉంటుంది. అందుకే దీనిని స్నేక్ ఫ్రూట్‌గా చెబుతుంటారు. ఈ పండును తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్నేక్ ఫ్రూట్‌లో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. తరచూ వచ్చే రోగాలను నయం చేయడంలో ఉపయోగపడుతుందని న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారికి కూడా ఈ పండు బాగా ఉపయోగపడుతుందంటున్నారు. శరీరంలో నీటి కొరతను దూరం చేస్తుందని.. అలాగే డయాబెటిస్ బాధితులకు కూడా స్నేక్ ఫ్రూట్ మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా గర్భిణీలకు ఈ పండు ఎంతో మేలు చేస్తుందని వారు సలహా ఇస్తున్నారు.
చిన్నారుల్లో జ్ఞాపకశక్తిని పెంచడంలో స్నేక్ ఫ్రూట్ కీలకపాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పండు బెస్ట్ ఆప్షన్‌గా చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇక ఈ ఫ్రూట్‌లో పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపు చేయడంలో ఉపయోగపడుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



