Health: రెగ్యులర్‌గా కాఫీ తాగితే.. లివర్‌కి ఏమవుతుందో తెలుసా?

Health: కాఫీ.. కాఫీ అలవాటు ఉన్న వారిలో చాలా మందికి ఇది లేకపోతే రోజు గడవదు. ఉదయం లేవగానే కచ్చితంగా కాఫీ తాగాల్సిందే.

Mokshith
Published on: 5 Feb 2025 5:05 PM IST
Health Benefits of Coffee and Know How Coffee Habit Helps Liver Health
X

Health: రెగ్యులర్‌గా కాఫీ తాగితే.. లివర్‌కి ఏమవుతుందో తెలుసా?

Health: కాఫీ.. కాఫీ అలవాటు ఉన్న వారిలో చాలా మందికి ఇది లేకపోతే రోజు గడవదు. ఉదయం లేవగానే కచ్చితంగా కాఫీ తాగాల్సిందే. ఇక సాయంత్రం అయ్యిందంటే చాలు ఒక కప్పు కాఫీ తాగితేనే మనసు నిమ్మలమవుతుంది. అయితే కాలక్షేపానికి తాగే కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? కాఫీ తాగితే ఒత్తిడి దూరమై, శరీరంలో ఉత్సాహం వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే కాఫీ తాగడం వల్ల లివర్‌ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ కాలేయంలో వాపును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా క్లోరోజెనిక్ యాసిడ్ (CGA) గ్లూకోజును విచ్ఛిన్నం చేసి, కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. కాఫీని రెగ్యులర్‌గా తీసుకుంటే కాలేయంలో దెబ్బతిన్న కణాలు తొలగిపోయి కొత్త కణాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. ఇక కాఫీ అడినోసిన్ గ్రాహకాల్లా పనిచేసి కాలేయం గట్టిపడకుండా కాపాడుతుందని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు.

రోజు 2 నుంచి 3 కప్పుల కాఫీ తాగే వారికి కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే కాఫీని రెగ్యులర్‌గా తీసుకుంటే ఇన్సులిన్‌ ప్రతిస్పందన మెరుగుపరిచి, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని తగ్గిస్తుంది.

అయితే మంచిది కదా అని కాఫీని ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 2 నుంచి 3 కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తీసుకోకూడదు. అదే విధంగా చక్కెరను తక్కువగా వేసుకోవాలి. ఇక కాఫీకి ఉపయోగించే పాలలో వెన్న తీసిన పాలను మాత్రమే ఉపయోగించాలి. మరీ ముఖ్యంగా బ్లాక్‌ కాఫీని అలవాటు చేసుకుంటే మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: ఈ వివరాలను ఇంటర్నెట్‌ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా వైద్యులను సంప్రదించి తీసుకోవడమే మంచిది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story