Top
logo

Health Benefits of Bitter Orange: నారింజ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...

Health Benefits of Bitter Orange: నారింజ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...
X
Highlights

Health Benefits of Bitter Orange: నారింజ లేదా నారింజ పండు సిట్రస్ జాతికి చెందిన ఫలం. దీనిని ఉష్ణ దేశాల్లోనూ, సమశీతోష్ణ ప్రాంతాల్లోనూ పండిస్తున్నారు.

Health Benefits of Bitter Orange: నారింజ లేదా నారింజ పండు సిట్రస్ జాతికి చెందిన ఫలం. దీనిని ఉష్ణ దేశాల్లోనూ, సమశీతోష్ణ ప్రాంతాల్లోనూ పండిస్తున్నారు. మన తెలుగు దేశంలో నంద్యాల, కోడూరు, వడ్లమూడి మొదలగు ప్రాంతాలలో బాగా పండిస్తున్నారు. నారింజపండ్లు కాలం గడుస్తున్న కొద్దీ ప్రకృతిరీత్యా మార్పులు చెందుతూ వస్తున్నాయి. నిమ్మ, బత్తాయి, నారింజ ఒకే జాతికి చెందిన ఫలాలు. వీని గుణాలు దాదాపు సమానంగానే ఉంటాయి. దీన్ని నిమ్మకన్నా కాస్త ఉత్తమం అంటారు. నిమ్మలోని గుణాలతో పాటుగా, తీపి అనే అదనపు గుణం కూడా నారింజ కుంటుంది.

నారింజ రకాలు...

నారింజలో రెండు రకాలున్నాయి - పుల్ల నారింజ, తీపి నారింజ. పుల్ల నారింజ కాయలలో నీరు అధికంగా ఉంటుంది, లవణాలు తక్కువగా ఉంటాయి. ఇవి వర్షాకాలంలో కాస్తుంటాయి. తీపి నారింజలు వేసవిలో కాస్తాయి. వీటిలో నీటి భాగం తక్కువ. లవణాలు ఎక్కువ. ఇది దేహానికి మేలు మేస్తాయి. కాబట్టి వేసవి కాలంలో కాచే నారింజ పండ్లను తినటం ఎక్కువ శ్రేయస్కరం.

చక్కగా తినేసి జీర్ణం చేసుకోగల ఫలం కమలాఫలం. ఆరెంజ్రంగులు చూడగానే తినేయాలని... జ్యూస్ తాగేయాలని అనిపించే పండు కమలాపండు. "ఆరెంజ్‌ క్లాటస్‌ ఆరంటమ్‌" అనే శాస్త్రీయ నామం కలిగిన నారింజ పండ్లు చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్‌, సంస్కృతంలో "నారంగ-ఐరావతి", హిందీలో "నారంగీ, సంతరా", బంగ్లాలో "కమలా రేఖ" అనే పేర్లతో పిలుస్తుంటారు. నారింజ పండు కఫం, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది.

ముదిరిన నారింజ కాయలను కోసి, ఉప్పులో ఊరబెట్టి, ఎండబెట్టి, కారం, మెంతిపొడి కలుపుకున్నట్లయితే.. ఊరగాయలా నిల్వ ఉంటుంది. రుచిగా ఉండటమే కాక, ఆరోగ్యాన్ని కూడా వృద్ది పరుస్తుంది. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడ.. నారింజను వాడితే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే, ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు ఉంది. నారింజలో బెటా కెరోటిన్అ నే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంట్లో ఉండే కాల్షియం.. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది.

నారింజలో ఉండే విటమిన్స్...

నారింజలో విటమిన్లు, లవణాలు, ఎక్కువగా ఉండటం వల్ల, దీనికి ప్రపంచంలో ఎంతో గిరాకీ ఉంది. విటమిన్ ‌- ఏ, బి స్వల్పంగా, విటమిన్‌ - సి ఎక్కువగా ఉంటాయి. ఆరు ఔన్సుల నారింజ రసం త్రాగితే చాలు, మనిషికి ఆ రోజుకు కావలసిన 'సి' విటమిన్‌ లభిస్తుంది. కోయకుండా అలాగే తినటం మంచిది, లేదా రసం తీసి త్రాగటం మంచిది. కాల్షియం ఈ పండులో ఎక్కువగా ఉంటుంది. దీనిలోని కాల్షియం దేహ ధాతువుల్లో సులభంగా కలసిపోతుంది.

నారింజ తొనల చర్మంలో కాల్షియం ఎక్కువ. తీపి నారింజలో చక్కెర ఎక్కువ. కాబట్టి అది కాస్త ఎక్కువ శక్తిని ఇస్తుంది. సూర్యరశ్మిలో పండినప్పుడు, నారింజలోని పిండిపదార్ధాలు చక్కెరగా మారుతాయి కాబట్టి, నారింజ సులభంగా జీర్ణ అవుతుంది. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జ్వరాలలో, జీర్ణశక్తి తగ్గినప్పుడు, నారింజను వాడితే, దేహానికి కావలసిన రీతిగా అజీర్ణవ్యాధి తగ్గిపోతుంది. ఆహారనాళ్ళలో విషక్రిములు చేరకుండా, నారింజ వాటిని చంపివేస్తూ ఉంటుంది.

నారింజ పండులోని పోషక విలువలు...

* తేమ - 87.8%

* సున్నము - 0.5% మై.గ్రా

* మాంసకృత్తులు - 0.9%

* పిండి పదార్ధలు - 10.6%

* భాస్వరము - 0.2% మై.గ్రా

* క్రొవ్వు - 0.3%

* ఇనుము - 01% మై.గ్రా

* సేంద్రియ లవణాలు - 0.4%

* విటమిన్‌ - ఏ - 350 I.U.

* విటమిన్‌ - బి1 - 120 I.U.

* విటమిన్‌ - సి - 68 I.U.

* నారింజపండు ఇచ్చే శక్తి - 49 కేలరీలు


Web TitleHealth Benefits of Bitter Orange (Narinja) By taking Regularly
Next Story