అరటి పండు మేలెంతో తెలుసా?

అరటి పండు మేలెంతో తెలుసా?
x
Highlights

అరటి పండు మేలెంతో తెలుసా? అరటి పండు మేలెంతో తెలుసా?

పండ్లు అరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అధిక పోషకాలు ఉండే పండ్లు అనేక రోగాలను నివారించడంలో కూడా ఉపయోగపడతాయి ముఖ్యంగా అరటిపండులో శరిరానికి కావలసిన పోషకాలు సమృద్థిగా దొరుకుతాయి. రక్తపోటును అదుపులో ఉంచుకోవటం ఒత్తిడిని తగ్గించండం కోసం అరటి ఉపయోగపడుతుంది. రక్తపోటుతో బాధపడేవారికి నిపుణులు అరటి పండు తినమని సూచిస్తారు.

ముఖ్యంగా మూత్రపిండాల పనితీరు మెరుగ్గా ఉండాలంటే శరీరంలో రక్త ప్రసరణ తీరు సరిగా ఉండాలి. మనం తీసుకునే ఆహారంపైనే రక్త ప్రసరణ అధారపడి ఉంటుంది. అది అదుపులో ఉండాలంటే అరటి పండ్లను ఎక్కువగా తింటూ ఉండాలి. శరీరంలో ఎక్కువ ద్రవాలు నిల్వ ఉండిపోతే రక్తపోటు పెరిగిపోతుంది. తక్కువ ఉంటే రక్తపోటు పడిపోతుంది. ఈ రెండూ ప్రమాదమే. కావున విటిని సమతుల్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది.

సోడియం ఎక్కువగా కిడ్నీల్లోకి చేరకుండా ఉండాలంటే అరటిపండు నియంత్రిస్తుంది. ఉప్పు పరిణామం శరీరంలో ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటు పెరిగిపోతుంది. ఇది నియంత్రణలో ఉండాలంటే నిల్వ వున్న నీటిని కిడ్నీల్లోకి చేరవేసే పొటాషియం ఉన్న ఆహారం తీసుకోవాలి. పోటాషియం అధిక మెుత్తంలో అరటి పండులో లభిస్తుంది. ఒక్క పండులో దాదాపు 422 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. మనకు రోజులో అవసరమైన పోటాషియం 4,700 మి.గ్రా. కావున రక్తపోటు ఉన్నవారు రోజుకో అరటిపండు తింటే మేలని వైద్యులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories