Breads For Weight Loss: ఈజీగా బరువు తగ్గాలా.. అయితే, ఈ బ్రెడ్‌ను డైట్‌లో చేర్చాల్సిందే..!

From Whole Wheat Bread to Whole Grain Bread add These 4 Breads for Healthy Weight Loss and Diabetics Sprouted Bread
x

Breads For Weight Loss: ఈజీగా బరువు తగ్గాలా.. అయితే, ఈ బ్రెడ్‌ను డైట్‌లో చేర్చాల్సిందే..!

Highlights

Breads For Weight Loss: బరువు తగ్గేవారు రొట్టెలకు దూరంగా ఉంటారు. రొట్టెలు తినడం వల్ల బరువు పెరుగుతారని వారు భావిస్తుండడమే ఇందుకు కారణం. డయాబెటీస్ పేషంట్స్ కూడా ఇలాగే చేస్తుంటారు.

Breads for weight loss: బరువు తగ్గాలనుకునే వారు రొట్టెలకు దూరంగా ఉండటం తరచుగా చూస్తుంటాం. బరువు తగ్గడానికి ప్రజలు ఆహారంలో బ్రెడ్ తినకుండా ఉంటారు. అదే విధంగా డయాబెటిక్ పేషెంట్లు కూడా టోస్ట్, శాండ్‌విచ్‌లను తమ శత్రువుగా భావిస్తుంటారు. అయితే బ్రెడ్ తినడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? మీ బరువు తగ్గించడంలో సహాయపడే ఇటువంటి ఆరోగ్యకరమైన బ్రెడ్‌లు మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.

బరువు తగ్గడం అంటే ఆహారం తగ్గించడమే కాదు.. పౌష్టికాహారం తినడం ద్వారా బరువు తగ్గడం అన్నమాట. ఇటువంటి రొట్టె గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా, సులభంగా బరువు తగ్గవచ్చు.

హోల్ వీట్ బ్రెడ్..

గోధుమ రొట్టె గోధుమ నుంచి తయారు చేస్తారనే విషయం తెలిసిందే. ఇది వైట్ బ్రెడ్ కంటే ఆరోగ్యకరమైనది. వైట్ బ్రెడ్‌లో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇది ఊబకాయాన్ని పెంచుతుంది. అయితే హోల్ వీట్ బ్రెడ్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతర రొట్టెల కంటే ఎక్కువ విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. గోధుమ రొట్టె తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. అయితే, స్టోర్ నుంచి కొనుగోలు చేసేటప్పుడు, మీరు దాని ప్యాక్‌పైన రాసిన 100% హోల్ వీట్ ఫ్లోర్ ట్యాగ్‌ను తప్పక తనిఖీ చేయాల్సి ఉంటుంది.

హోల్ గ్రెయిన్ బ్రెడ్..

ఈ రొట్టె పూర్తిగా అధిక పోషక విలువలు, తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన ధాన్యాలతో తయారు చేస్తారు. తిన్న తర్వాత రక్తంలో చక్కెర ఎంత వేగంగా పెరుగుతుందో గ్లైసెమిక్ ఇండెక్స్ తెలియజేస్తుంది. ధాన్యపు రొట్టెలో రై, బార్లీ, ఓట్స్, క్వినోవా, మిల్లెట్ ఉంటాయి. ఈ బ్రెడ్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. హోల్ గ్రెయిన్ బ్రెడ్ బరువు తగ్గడానికి మరింత ఆరోగ్యకరమైనది. ఈ రకమైన బ్రెడ్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగులను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

మొలకెత్తిన గింజలతో రొట్టె..

మొలకెత్తిన రొట్టెలో పిండి ఉండదు. బదులుగా ఇది మొలకెత్తిన ధాన్యాలు, బీన్స్, విత్తనాల నుంచి తయారు చేస్తారు. వీటిని పిండిలో కలిపి నెమ్మదిగా కాల్చాలి. ఈ ప్రక్రియ బ్రెడ్ గ్లైసెమిక్ సూచికను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే ఈ బ్రెడ్ మీ బ్లడ్ షుగర్‌ని అదుపులో ఉంచుతుంది.

సోర్డోఫ్ బ్రెడ్..

పిండి, నీరు, ఉప్పు సంప్రదాయ సోర్డోఫ్ బ్రెడ్ చేయడానికి ఉపయోగిస్తారు. దీన్ని సిద్ధం చేయడానికి ప్రత్యేకంగా ఈస్ట్ జోడించరు. ఇది బ్రెడ్‌లో ఉండే బ్యాక్టీరియా ద్వారా పులుస్తుంది. పిండిలో ఉండే స్టార్చ్ కిణ్వ ప్రక్రియ ద్వారా పెరుగుతుంది. కిణ్వ ప్రక్రియ బ్రెడ్ గ్లైసెమిక్ సూచికను తగ్గిస్తుంది. సహజ ప్రోబయోటిక్‌లను జోడిస్తుంది. ఈ రొట్టె తినడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అలెర్జీల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories