Health Tips: రోజ్‌ వాటర్‌ అందానికి మాత్రమే కాదు.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!

From Bad Digestion to Stress Rose Water is a Great Solution to These Health Problems
x

Health Tips: రోజ్‌ వాటర్‌ అందానికి మాత్రమే కాదు.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Highlights

Health Tips: రోజ్ వాటర్ చర్మ సంరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

Health Tips: రోజ్ వాటర్ చర్మ సంరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తారు. గులాబీ రేకుల నుంచి తయారైన ఈ నీటిని చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి , పోషణకి వినియోగిస్తారు. అయితే రోజ్ వాటర్ ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మందులు, ఆహార పదార్థాలలో కూడా వాడుతారు. మార్కెట్‌లో లభించే రోజ్ వాటర్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో ఈరోజు తెలుసుకుందాం.

గొంతు నొప్పి పోతుంది

ప్రాచీన కాలంలో భారతీయులు గులాబీ రేకుల ద్వారా మందులని తయారుచేసేవారు. నేటికీ స్వదేశీ మందులలో రోజ్ వాటర్ చేర్చడం ద్వారా గొంతులో వాపుని తొలగించవచ్చు. దీని యాంటీ బాక్టీరియల్ ప్రభావాలు గొంతు సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.

కంటి చికాకు

పాత రోజుల్లో కళ్లను శుభ్రం చేయడానికి రోజ్ వాటర్‌ను ఉపయోగించేవారు. ఇది కళ్ళలో చికాకు లేదా దురదను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నేడు అనేక కంటి సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో రోజ్ వాటర్ ఖచ్చితంగా వినియోగిస్తారు. చర్మానికి, కళ్లకు చల్లదనాన్ని ఇచ్చే రోజ్ వాటర్ ని కూలింగ్ ఏజెంట్ అని అంటారు.

గాయాలు మానడం

రోజ్ వాటర్ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా గాయాలు వేగంగా నయం అవుతాయి. గులాబీ రేకుల నుంచి ఇతర మందులని తయారు చేస్తారు. వీటిని గాయాలు, చర్మ అలెర్జీలు లేదా ఇతర సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.

ఒత్తిడిని తగ్గించుకోవచ్చు

రోజ్ ఆయిల్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. గులాబీ రేకులతో చేసిన నీళ్లతో స్నానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతతతోపాటు మంచి అనుభూతి కలుగుతుంది.

జీర్ణక్రియ

అనేక పరిశోధనలలో రోజ్ ఎసెన్స్‌తో కడుపు సమస్యలను సులభంగా అధిగమించవచ్చని తేలింది. పురాతన కాలంలో గులాబీ రేకులను కడుపుని శాంతపరచడానికి ఉపయోగించేవారు. రోజ్ వాటర్‌తో ఉబ్బరం లేదా ఇతర కడుపు సమస్యలను తగ్గించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories