Health: బెల్లీ ఫ్యాట్‌ తగ్గడానికి ఈ చిట్కాలు పాటించండి..

Follow These Tips to Reduce Belly Fat
x

Health: బెల్లీ ఫ్యాట్‌ తగ్గడానికి ఈ చిట్కాలు పాటించండి..

Highlights

Health: బెల్లీ ఫ్యాట్‌ పెరగడం వల్ల అనేక సమస్యలు తలెత్తడమే కాకుండా మొత్తం శరీర ఆకృతి దెబ్బతింటుంది.

Health: బెల్లీ ఫ్యాట్‌ పెరగడం వల్ల అనేక సమస్యలు తలెత్తడమే కాకుండా మొత్తం శరీర ఆకృతి దెబ్బతింటుంది. ఇది టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే కొన్ని చర్యల ద్వారా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరానికి శక్తి కావాలంటే కొద్దిగా కొవ్వు అవసరం. కానీ అధిక కొవ్వు వ్యాధులకు దారి తీస్తుంది. దీనిని తగ్గించేందుకు అవసరమైన కొన్ని చర్యలు తీసుకోవచ్చు.

రోజూ 10 గ్రాముల ఫైబర్ తింటే బెల్లీ ఫ్యాట్‌ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజూ 2 యాపిల్స్ లేదా ఒక కప్పు పచ్చి బఠానీలను తినండి. అయితే ఏ ఆహారం అయినా చిటికెలో బెల్లీ ఫ్యాట్‌ని తొలగించదు. దీని కోసం కొన్ని ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీరు పొట్ట కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల వ్యాయామం చేయాలి. చెమట బయటకు వచ్చేలా వ్యాయామం ఉండాలి. దీని కోసం మీరు జుంబా, ఫుట్‌బాల్, స్విమ్మింగ్ లేదా కార్డియో చేయవచ్చు.

పుష్కలంగా నిద్రపోండి

తక్కువ నిద్రపోవడం మీ జీవక్రియను నెమ్మదిస్తుంది. ఇది వేగంగా కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. అందువల్ల ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటల నిద్రపోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి ఉంటుంది. అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే ఈ ఒత్తిడిని పరిమితిలో పెట్టుకోవాలి. ఎందుకంటే బెల్లీ ఫ్యాట్ పెరగడానికి ఇది కూడా కారణం కావచ్చు. మీరు ధ్యానం చేయవచ్చు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి నిపుణుల సహాయం తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories