Health Tips: రాత్రిపూట పాదాలలో నొప్పిగా ఉంటుందా.. ఇలా చేస్తే తక్షణ ఉపశమనం..!

Follow These Home Remedies if you Have Severe Pain in Your Foot at Night You will get Instant Relief
x

Health Tips: రాత్రిపూట పాదాలలో నొప్పిగా ఉంటుందా.. ఇలా చేస్తే తక్షణ ఉపశమనం..!

Highlights

Health Tips: కొంతమందికి రాత్రి పడుకునే ముందు కాళ్లలో, పాదాలలో తీవ్రమైన నొప్పి ఉంటుంది.

Health Tips: కొంతమందికి రాత్రి పడుకునే ముందు కాళ్లలో, పాదాలలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇది ఇప్పుడు అందరికి సర్వ సాధారణంగా మారింది. ఈ నొప్పి కారణంగా రోజంతా చాలా సార్లు అలసట ఉంటుంది. సమయానికి శ్రద్ధ చూపకపోతే ఈ సమస్య పెరుగుతుంది. అయితే పాదాల నొప్పి నుంచి విముక్తి పొందడానికి మీరు ఎలాంటి పద్దుతులు పాటించాలో తెలుసుకుందాం.

మస్టర్డ్ ఆయిల్‌తో మసాజ్

మస్టర్డ్ ఆయిల్ పాదాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట ఆవాల నూనెను వేడి చేసి పాదాలను బాగా మసాజ్ చేయాలి. ఇది మీకు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్,తేనె

ఆపిల్ సైడర్ వెనిగర్ పాదాల నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో అనాల్జేసిక్ గుణాలు ఉంటాయి. ఇవి పాదాలలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతాయి. మీరు ఒక కప్పులో రెండు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, అర టీస్పూన్ తేనె కలిపి పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

మెంతులు

మెంతులు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మంచి నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఒక చెంచా మెంతులని రాత్రంతా నానబెట్టి ఉంచాలి. ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో ఆ డికాషన్ తాగాలి. ఇలా చేయడం వల్ల పాదాల నొప్పులను దూరం చేసుకోవచ్చు.

ప్రతిరోజూ యోగా

రోజూ యోగా చేయడం ద్వారా పాదాల నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. యోగా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. కాబట్టి మీ పాదాలలో లేదా మీ శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే యోగాను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories