Lifestyle: వందేళ్లు జీవించాలని ఉందా.? ఈ 5 అలవాట్లతో సాధ్యమే..

Follow These 5 Tips for Living Long Life
x

Lifestyle: వందేళ్లు జీవించాలని ఉందా.? ఈ 5 అలవాట్లతో సాధ్యమే..

Highlights

Tips for Long life: ఎక్కువ కాలం జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది కూడా ఆయురాగ్యంతో.

Tips for Long life: ఎక్కువ కాలం జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది కూడా ఆయురాగ్యంతో. అయితే ప్రస్తుతం మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, తగ్గిన శారీరక శ్రమ , మానసిక ఒత్తిడితో వ్యాధుల త్వరగా అనారోగ్యానికి గురౌతున్నారు.

అయితే జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకోవడం వల్ల ఎక్కువ కాలం జీవించడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ 5 అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సరైన ఆహారపు అలవాట్లు దీర్ఘాయుష్షుకు మూలం. తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, ప్రోటీన్‌ ఉండేలా చూసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక చక్కెర, కొవ్వు పదార్థాలను వీలైనంత వరకు తగ్గించాలి.

రోజువారీ వ్యాయామం శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. నడక, యోగా లేదా జిమ్‌లో వ్యాయామం చేయడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి కచ్చితంగా ప్రతీ రోజూ వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి.

ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇందుకోసం ధ్యానం, ప్రాణాయామం అలవాటు చేసుకోవాలి. రోజులో కచ్చితంగా కొద్ది సేపైనా యోగా, మెడిటేషన్‌ చేయాలి.

సరైన నిద్ర కూడా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే రోజులో కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. దీంతో శరీరంలో అన్ని అవయవాలు సవ్యంగా పనిచేస్తాయి.

కుటుంబం, స్నేహితులతో సమయం గడపడం అలవాటు చేసుకోవాలి. సామాజిక సంబంధాలు మానసిక ఆనందాన్ని పెంచుతాయి, ఒంటరితనాన్ని దూరం చేస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories