Top
logo

జుట్టు సమస్యా... మెంతీ ప్యాక్ పర్ఫెక్ట్‌ అట

జుట్టు సమస్యా... మెంతీ ప్యాక్ పర్ఫెక్ట్‌ అట
X
Highlights

తినడానికి చేదుగానే ఉంటాయి.. కానీ శరీరానికి అవి చేసే మేలు అన్నీ ఇన్నీ కావు. కాకరకాయలు, మెంతులు తినేందుకు చేదుగా ఉన్నా... ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్రను పోషిస్తాయి.

తినడానికి చేదుగానే ఉంటాయి.. కానీ శరీరానికి అవి చేసే మేలు అన్నీ ఇన్నీ కావు. కాకరకాయలు, మెంతులు తినేందుకు చేదుగా ఉన్నా... ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్రను పోషిస్తాయి. ముఖ్యంగా మన ఇంట్లోని పోపు డబ్బాల్లో నిత్యం లభించేవ మెంతులను వంటకాల్లో పచ్చళ్ల తయారీల్లో పుసులుల్లో పోపుల్లో వాడటమే కాదు.. వాటిని నేరుగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి... నానబెట్టి తిన్నా, పొడి చేసి కషాయంలా తాగినా... చక్కటి ఫలితాలు లభిస్తాయి . మెంతుల్లో పీచు, ఐరన్, కాల్షియంతో పాటు విటమిన్ సి, బి1, బి2 ఉంటాయి.. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

చాలా మంది స్త్రీలు కేశ సంరక్షణ కోసం వివిధ రకాల షాంపూలు, ట్రీట్‌మెంట్‌ల కోసం వేల వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు... అలా కాకుండా మన ఇంట్లో లభించే మెంతులతో జుట్టు సమస్యలకు చెక్ చెప్పవచ్చట.. మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని జుట్టుకు పట్టించాలి... ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నీటిలో నానబెట్టిన మెంతులను పేస్ట్‌లా గ్రైండ్ చేసుకుని అందులో పెరుగు వేసి బాగా తలకు పట్టించి ప్యాక్‌లా వేసుకోవాలి.... అలా ఓ గంట సేపు అరనిచ్చాక గోరువెచ్చడి నీటితో తలస్నానం చేయాలి... ఇలా చేయడం వల్ల చాలా వరకు మహిళలు ఎదుర్కొనే జుట్టుసమస్యలను పారద్రోలవచ్చట.

అలాగే మెంతులతో జీర్ణ సమస్యలు కూడా తీరుతాయి.. ఓ గ్లాస్ నీటిలో టీస్పూన్ మెంతులను వేసి నానబెట్టి.. ఆ నీటిని రోజూ ఉదయం లేదా సాయంత్ర తరచూ తాగుతూ ఉండాలి.. దీని వల్ల మలబద్ధకం మటుమాయం అవుతుంది. ఇక బాలింత స్త్రీలు మెంతులను నానబెట్టి ఆ నీటిని తాగినా మెంతికూర తిన్నా పాల ఉత్పత్తి పెరుగుతుంది. మధుమేహ గ్రస్తుతులు మెంతులను తీసుకుంటే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

ఇప్పటి వరకు మెంతుల ఉపయోగాలు తెలుసుకున్నాం కదా...మెంతి ఆకుతో కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం...పైత్యం అధికంగా ఉన్నవారు..మెంతి ఆకులను రసంగా చేసి తాగితే చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఇక నిద్ర సమస్యతో బాధపడే వారకి దివ్య ఔషదంగా మెంతి ఆకు పనిచేస్తుంది...ఈ ఆకుల రసాన్ని రాత్రి పూట భోజనానికి ముందతే సేవిస్తే... చక్కగా నిద్రపడుతుంది. అంతే కాదు అధిక బరువుతో బాధపడేవారు...ఈ రసాన్ని భోజనానికి ముందు తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. మెంతులు తిన్నట్లు జుట్టు సమస్యలు తీరినట్లే...ఈ మెంతి ఆకు పేస్ట్‌ను కూడా తలకు పట్టిస్తే... చుండ్రు, వెంట్రుకలు ఊడే సమస్య తగ్గుతుంది.

Web TitleFenugreek (Methi) Seeds to Prevent Hair fall
Next Story