Cauliflower: పొరపాటున కూడా ఈ వ్యక్తులు కాలీఫ్లవర్‌ తినకూడదు.. ఎందుకంటే..?

Cauliflower: కాలీఫ్లవర్‌ తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Arun Chilukuri
Published on: 7 Dec 2022 5:43 PM IST
Even by Mistake These People Should not eat Cauliflower the Problem Will Increase
X

Cauliflower: పొరపాటున కూడా ఈ వ్యక్తులు కాలీఫ్లవర్‌ తినకూడదు.. ఎందుకంటే..?

Cauliflower: కాలీఫ్లవర్‌ తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే కాలీఫ్లవర్ కొంతమందికి హానికరంగా మారుతుంది. కొన్ని ఆరోగ్య పరిస్థితులలో కాలీఫ్లవర్‌లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు. వారి గురించి తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు

మీకు గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ సమస్యలు ఉంటే క్యాలీఫ్లవర్ తినడం హానికరం. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు సులభంగా జీర్ణం కావు. సమస్య మరింత పెరుగుతుంది. ఈ పరిస్థితిలో కాలీఫ్లవర్ తినకుండా ఉండటం మంచిది.

కిడ్నీ స్టోన్

కిడ్నీ స్టోన్ విషయంలో పొరపాటున కూడా కాలీఫ్లవర్ తినకూడదు. ఇందులో క్యాల్షియం అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది రాళ్ల సమస్యను పెంచుతుంది.

థైరాయిడ్

కాలీఫ్లవర్ థైరాయిడ్‌లో హానికరం అవుతుంది. ఇది T3, T4 హార్మోన్ల పరిమాణం పెంచుతుంది. కాలీఫ్లవర్ తినడం వల్ల థైరాయిడ్ వ్యాధికి గురవుతారు.

కీళ్ళ నొప్పి

కీళ్లలో నొప్పి, వాపు, యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కాలీఫ్లవర్ తినకూడదు. ఎందుకంటే ఇది సమస్యని మరింత పెంచుతుది. దీంతో కీళ్లలో వాపు, నొప్పి ఎక్కువవుతుంది.

రక్తం చిక్కగా

కాలీఫ్లవర్ తినడం వల్ల రక్తం చిక్కగా మారుతుంది. రక్తానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే కాలీఫ్లవర్ తినకుండా ఉండాలి. బ్లడ్ ప్రెజర్ సమస్య ఉన్న సందర్భాల్లో క్యాలీఫ్లవర్ తినడం మానేయాలి.

పాలిచ్చే స్త్రీలు

పాలిచ్చే స్త్రీలు కాలీఫ్లవర్ తినకుండా ఉండాలి. కాలీఫ్లవర్ తినడం వల్ల వారి పిల్లలకు హాని కలుగుతుంది. దీనివల్ల తల్లి పాలు తాగే పిల్లలకు కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story