Health Tips: కొంతమందికి 8 గంటల నిద్ర సరిపోదు.. కారణం ఏంటంటే..?

Eight Hours of Sleep is not Enough for Some People Know the Reason
x

Health Tips: కొంతమందికి 8 గంటల నిద్ర సరిపోదు.. కారణం ఏంటంటే..?

Highlights

Health Tips: ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ప్రశాంతమైన నిద్ర అవసరం.

Health Tips: ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ప్రశాంతమైన నిద్ర అవసరం. సాధారణంగా ఆరోగ్య నిపుణులు 24 గంటల్లో కనీసం 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తారు. అప్పుడే శరీరం రిలాక్స్‌గా ఉంటుంది. అలసిపోకుండా రోజులోని ముఖ్యమైన పనిని చేయగలుగుతాము. కానీ కొంతమందికి 8 గంటల నిద్ర సరిపోదు. దీనికి కారణం ప్రతి మానవ శరీరం భిన్నంగా స్పందిస్తుంది. అందుకే కొంతమంది నిర్ణీత సమయం కంటే ఎక్కువ నిద్రపోతారు. లేకపోతే వారి ఆరోగ్యం దెబ్బతింటుంది.

8 గంటల నిద్ర సరిపోదు

సాధారణంగా చాలామందికి 8 గంటల నిద్ర సరిపోతుంది. దీని తర్వాత మరింత సమయం నిద్రపోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి బద్ధకం, బలహీనత ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రెండు కారణాలు ఉన్నవారు ఎక్కువ నిద్రపోతారు. దాదాపు 8 గంటల నుంచి 9 లేదా 10 గంటల వరకు నిద్రపోతారు. అప్పుడు మాత్రమే వీరు ప్రెష్‌గా కనిపిస్తారు.

సీజన్‌లో మార్పు

వాతావరణంలో మార్పు సంభవించినప్పుడు సాధారణం కంటే ఎక్కువ నిద్రపోవాల్సి ఉంటుంది. సీజన్ మార్పు కారణంగా రాత్రిపూట ప్రశాంతమైన నిద్రను పోలేకపోవచ్చు. ఈ సందర్భంలో నిద్ర సమయాన్ని పూర్తి చేయడానికి ఎక్కువ నిద్రించవలసి ఉంటుంది.

ఋతు చక్రం

ప్రతి నెలా రుతుక్రమం సమయంలో స్త్రీల శరీరం అనేక అంతర్గత మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో ఆమె చాలా బలహీనత, అలసటను అనుభవిస్తుంది. కాబట్టి ఆమె ఋతు చక్రంలో సుమారు 9 గంటలు నిద్రపోవాలి. అప్పుడే ఆమె నొప్పి నుంచి కొంత ఉపశమనం పొందగలుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories