Health: బెండ తింటే గుండె ఫిట్‌.. పోషకాలు పుష్కలం

Eating Lady Finger is Good for Heart Health it is Rich in Nutrients
x

Health: బెండ తింటే గుండె ఫిట్‌.. పోషకాలు పుష్కలం

Highlights

Health: పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి.

Health: పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి. కొన్ని కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో బెండ కూడా ఒకటి. దీనిని తినడం వల్ల బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ ఉండటమే కాకుండా గుండెను ఫిట్‌గా ఉంచుతుంది. కాబట్టి లేడీఫింగర్ తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

బెండ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

బెండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్‌తో సహా అనేక పోషకాలు అధికంగా ఉంటాయి. బెండలో పెక్టిన్ అనే మూలకం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బాడీలో కొలెస్ట్రాల్ సమతుల్యంగా ఉన్నప్పుడు గుండెపోటు ప్రమాదం తక్కువగా ఉంటుంది.

రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది

డయాబెటిక్ రోగులు బెండ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో అధిక ఫైబర్ ఉంటుంది. బెండ తినడం వల్ల జీర్ణవ్యవస్థతో పాటు శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని కూడా సరిచేయవచ్చు.

క్యాన్సర్‌ తగ్గించడంలో ఉపయోగపడుతుంది

ఇతర కూరగాయల కంటే బెండలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే అధిక ఫైబర్, ఆరోగ్యకరమైన జీర్ణక్రియను కొనసాగిస్తూ క్యాన్సర్ ప్రమాదాలను నివారిస్తుంది.

బెండ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

కరోనా యుగంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. ఈ పరిస్థితిలో బెండకాయ తినడం చాలా ముఖ్యం. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. కాబట్టి బెండకాయని ప్రతిరోజు తినడానికి ప్రయత్నించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories