
Vision loss in kids: చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో రకాల ప్లానింగ్స్ వేస్తుంటారు. వారి చదువు, ఆర్థిక భద్రతకు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే పౌష్టికాహారం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోరు.
Vision loss in kids: జంక్ ఫుడ్.. ఇటీవల సర్వసాధారణంగా మారింది. చిన్నారులు జంక్ ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. క్విక్ కామర్స్ అందుబాటులోకి రావడం, క్షణాల్లో ఇంటి ముందు ఫుడ్ డెలివరీలు అవుతుండడం, జంక్ ఫుడ్ తినడం ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న తరుణంలో చాలా మంది దీనికి అలవాటుపడుతున్నారు. అయితే జంక్ ఫుడ్ తీసుకుంటే చిన్నారుల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
జంక్ ఫుడ్ కారణంగా మలేషియాకు చెందిన ఓ 8 ఏళ్ల బాలుడు ఉన్నఫళంగా కంటి చూపును కోల్పోయాడు. దీంతో వైద్యులు పరీక్షలు చేయగా పేలవమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అతని శరీరంలో విటమిన్ ఎ పూర్తిగా తగ్గినట్లు, కంటి చూపు కోల్పోవడానికి ఇదే కారణమని తేల్చి చెప్పారు. దీంతో ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసుకుంది. తీసుకునే ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతోంది.
ఆ చిన్నారి ఆప్టిక్ న్యూరోపతితో బాధపడుతున్నాడని తేలింది. ప్రతీ ఒక్కరికీ విటమిన్ ఏ చాలా ముఖ్యంగా. అయితే కంటి చూపును కోల్పోయిన సదరు చిన్నారి ఎక్కువగా చికెన్ నగ్గెట్స్, సాసేజ్, కుకీలు వంటి జంక్ ఫుడ్‌నే తీసుకున్నాడని తేలింది. ఈ కారణంగానే శరీరంలో విటమిన్ ఎ తీవ్ర స్థాయిలో లోపం ఏర్పడింది. ఆప్టిక్ నరాల వంటి తీవ్రమైన వ్యాధికి గురి కావడంతో కంటి చూపు పోయిందని నిపుణులు చెబుతున్నారు.
చిన్నారులు జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల వారి శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 8 శాతం వరకు పెరిగిందని పరిశోధనల్లో వెల్లడైంది. ఇలాంటి వాటిని తక్కువగా తీసుకుంటే, ఆలోచనా సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం 12 శాతం తగ్గుతుందని, పక్షవాతం వచ్చే ప్రమాదం 9 శాతం తగ్గుతుందని కూడా అధ్యయనంలో తేలింది.
చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో రకాల ప్లానింగ్స్ వేస్తుంటారు. వారి చదువు, ఆర్థిక భద్రతకు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే పౌష్టికాహారంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోరు. చిన్నారులకు ఇచ్చే ఆహారంలో కచ్చితంగా పౌష్టికాహరం ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌ను వీలైనంత వరకు తగ్గించి విటమిన్స్ లభించే ఆహారాన్ని అందించాలి. తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ సి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




