ఈ మాంసం తింటున్నారా.. అయితే..!

ఈ మాంసం తింటున్నారా.. అయితే..!
x
Highlights

ఈ మాంసం తింటున్నారా.. అయితే..! ఈ మాంసం తింటున్నారా.. అయితే..!

మాంసం అంటే చాలు లొట్టలేసుకుని తినే భోజన ప్రియులు చాల మంది ఉన్నారు. వారానికి రెండు.. మూడు రోజులు మీట్ లాంగించే వారు కూడా ఉన్నారు. మాంసాహారం అతిగా తింటే రోగాల బారిన పడాల్సివస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రెడ్‌ మీట్ తినడం ఎంత తగ్గిస్తే.. గుండెజబ్బులు వచ్చే అవకాశాలు అంత తగ్గుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. గొడ్డు, మేక, పంది మాంసాలు(రెడ్‌ మీట్‌) బాగా తినేవారి ధమనుల్లో చెడు కొలెస్టరాల్‌ పేరుకుపోయి, గుండె జబ్బులకు దారితీసే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నిల్వ ఉంచిన జంతు మాంసం, ఎరుపు రంగులోకి మారిన మాంసం, ప్రాసెస్ చేసి ప్యాకింగ్ రూపంలో వచ్చే మాంసం తినేవారికి పెద్ద పేగు కాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మాంసాన్నిమరి మితిమీరి తినకుండా.. అప్పుడప్పుడు తింటే ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ జంతు మాంసం తింటే ప్రమాదం అంటున్నారు నిపుణులు. అంటే వారానికి 350 గ్రాముల కంటే ఎక్కువ మాంసం తినకూడదు. ముఖ్యంగా ఫ్రై చేసిన మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం తినకుండా ఉంటే మంచిది. ఇంట్లోనే వండుకుని లిమిట్‌గా తింటే చాల మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories