Lifestyle: గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లే

Early symptoms of several health issues alerts through unhealthy nails
x

Lifestyle: గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లే

Highlights

What unhealthy nails tells about your health? : శరీరంలో సంభవించే మార్పులు, అనారోగ్య సమస్యలను ముందుగా చర్మం, జుట్టూ, గోళ్లే బయట పెడతాయని నిపుణులు చెబుతున్నారు.

Unhealthy nails: మనిషి ఆరోగ్యాన్ని శరీరంలో కొన్ని లక్షణాల ఆధారంగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతుంటారు. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను ముందుగానే మన శరీరం వివిధ రకాలుగా అలర్ట్‌ చేస్తుంటుంది. ముఖ్యంగా కొన్ని వ్యాధుల గురించి అలర్ట్‌ చేసేందుకు శరీరం కొన్ని రకాల సూచనలు తెలియజేస్తుంది. శరీరంలో సంభవించే మార్పులు, అనారోగ్య సమస్యలను ముందుగా చర్మం, జుట్టూ, గోళ్లే బయట పెడతాయని నిపుణులు చెబుతున్నారు.

చేతి గోళ్లపై జరిగే మార్పులు మన అనారోగ్యాలను ముందుగానే చెబుతాయని అంటున్నారు. క్లీవ్‌ల్యాండ్, మేయోక్లినిక్‌లకి చెందిన శాస్త్రవేత్తలు ఇందుకు సంబంధించి కొన్ని ఆసక్తిర విషయాలను తాజాగా వెల్లడించారు. చేతి గోళ్లలో జరిగే మార్పుల ఆధారంగా మన ఆరోగ్యాన్ని అంచా వేయొచ్చని చెబుతున్నారు. చేతిగోళ్లపైన ఉండే తెలుపురంగు మచ్చలకీ, మనలోని అనారోగ్యాలకీ ఉన్న సంబంధాన్ని పరిశోధకులు గుర్తించారు. గోళ్లలో వచ్చే మార్పులు అనారోగ్యానికి సంకేతంగా భావించాలని వారు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా చేతి గోళ్లలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు అనారోగ్యానికి సంకేతంగా భావించాలని అంటున్నారు. గోళ్లు పలచగా లేదా మందంగా మారినా తెల్లని మచ్చలూ గీతలూ వంటివి కనిపించినా అవి మనలోని అనారోగ్యాలకి సంకేతాలుగా భావించాలని అంటున్నారు. ఒకవేళ చేతి గోళ్లు పలచగా మారి, నిలువు గీతలు స్పష్టంగా ఉంటే అది హార్మోన్ల అసమతుల్యతకీ ముందస్తు సంకేతంగా భావించాలని నిపుణులు అంటున్నారు.

చేతి గోళ్లలో కనిపించే హైపోథైరాయిడిజమ్‌కి ప్రాథమిక సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. గోళ్లు వంపుగా కాకుండా కొద్దిగా పైకి లేచి చెంచా మాదిరిగా మారితే జింక్, ఇనుము లోపానికి చిహ్నమని భావించాలని అంటున్నారు. అదే విధంగా గోళ్లపై కనిపించే గీతలు ఏర్పడితే అవి ఇన్‌ఫెక్షన్లకీ, మధుమేహానికీ సూచనగా భావించాలని చెబుతున్నారు. ఇలా గోళ్లు చెప్పే విషయాలను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories