Health: వర్కవుట్స్‌ తర్వాత కూల్‌ వాటర్ తాగుతున్నారా..!

Drinking Cool Water After Workouts Very Dangerous
x

Health: వర్కవుట్స్‌ తర్వాత కూల్‌ వాటర్ తాగుతున్నారా..!

Highlights

Health: మీరు వ్యాయామం తర్వాత చల్లని నీరు తాగుతున్నట్లయితే ఇక ఆపండి.

Health: మీరు వ్యాయామం తర్వాత చల్లని నీరు తాగుతున్నట్లయితే ఇక ఆపండి. ఎందుకంటే దీని ద్వారా మీరు అనేక రకాల వ్యాధులకు విందు ఇస్తున్నారని అర్థం. ఇది గుండెపోటు నుంచి బరువు పెరగడం వరకు ప్రభావం చూపుతుంది. అందుకే వర్కవుట్ చేసిన తర్వాత చల్లని నీరు తాగకూడదని నిపుణులు భావిస్తున్నారు. ఇది కాకుండా ఏ ఇతర సమస్యలు ఏర్పడుతాయో వివరంగా తెలుసుకుందాం.

1. చల్లటి నీరు తాగకూడదు: నిజానికి పని చేసిన తర్వాత శరీరం వేడెక్కుతుంది. ఈ పరిస్థితిలో మీరు చల్లటి నీరు తాగినప్పుడు అది అకస్మాత్తుగా మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత చల్లటి నీరు తాగితే ఇదే జరుగుతుంది. అంతేకాదు చేసిన వర్కవుట్స్‌ వల్ల శరీరానికి ఎటువంటి ఉపయోగం ఉండదు.

2. గుండెపై ప్రభావం: వ్యాయామం తర్వాత చల్లని నీరు తాగడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. నిజానికి, వ్యాయామం సమయంలో మీ సిరల్లో రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. ఈ పరిస్థితిలో మీరు అకస్మాత్తుగా చల్లటి నీటిని తీసుకుంటే అది మీ నరాలని చాలా వేగంగా చల్లబరుస్తుంది.

3. తలనొప్పి సమస్య: మీరు వ్యాయామం తర్వాత చల్లని నీరు తాగిన వెంటనే మీకు తలనొప్పి సంభవించవచ్చు. సైనస్ వ్యాధిగ్రస్తులు చల్లటి నీటిని అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది.

4. జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది: చల్లటి నీరు మీ జీర్ణక్రియని కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా మీరు కడుపు నొప్పి, తిమ్మిరి, జీర్ణ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా ఎండాకాలం చల్లటి నీరు తాగడం వల్ల గొంతు సమస్యలు, జలుబు తరచుగా వేధిస్తాయి.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories