చెరుకు రసంతో ఫ్యాట్‌కు చెక్

చెరుకు రసంతో ఫ్యాట్‌కు చెక్
x
Highlights

వేసవి కాలం వచ్చేసింది.. దాహార్తిని తీర్చుకునేందుకు కూల్‌డ్రింక్స్ మంచి నీరు తాగుతుంటాం.. చల్లనివి తాగేప్పుడు బాగానే ఉంటుంది.

వేసవి కాలం వచ్చేసింది.. దాహార్తిని తీర్చుకునేందుకు కూల్‌డ్రింక్స్ మంచి నీరు తాగుతుంటాం.. చల్లనివి తాగేప్పుడు బాగానే ఉంటుంది.. కానీ మన ఆరోగ్యానికి చాలా నష్టాన్ని చేకూరుస్తాయి. వేసవిలో విరివిగా దొరికే చెరకు రసంతో దాహం తీరడమే కాదుశరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. శక్తినిచ్చే ఈ వేసవి పానియానికి మేలు చేసే గుణాలు అనేకం..చెరకు రసం స్పొర్ట్స్ డ్రింక్‌గా ఉపయోగపడుతుంది. ఆటల వల్ల వచ్చే అలసటను దూరం చేసేందుకు ఇది పనిచేస్తుంది. చెరకు రసంలో సుక్రోజ్ రూపంలో ఉండే చెక్కరను శరీరం తేలిగ్గా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి చెరకు రసం తాగగానే తక్షణం శరీరానికి శక్తి వస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడిన వారు చెరకు రసం తాగితే త్వరగా కోలుకుంటారు. చెరకులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది..కాబట్టి షుగర్ పేషంట్లు ఈ చెరకు రసం త్రాగవచ్చు.

ఇక ఓవర్ వేట్ తో బాధపడేవారు చెరకు రసాన్ని నిస్సందేహంగా సేవించవచ్చు. పీచు పదార్ధాలు, పోషకాలు కలిగిన చెరకు రసం శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గిస్తుందని నిపుణుల మాట. మరీ ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ కంటెంట్‌ను ఇది కరిగిస్తుంది. రోజూ ఒక గ్లాసెడు చెరకు రసం తాగితే చాలు ఆరోగ్యం మీచెంతే అంటున్నారు నిపుణులు.. ఎందుకంటే ఇందులో ఫైబరే కాదు.. ప్రోటీన్లు, పొటాషియం, కాల్షియం, ఐరన్,జింకు అమైనో యాసిడ్లు ఉంటాయి..ఇవి శరీరంలోని బరువును ఎంచక్కా తగ్గిస్తాయి.

కామెర్లు వంటి సమస్యల నుంచి బయటపడేందుకు చెరకు రసం ఉపకరిస్తుంది. ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక లంగ్, బ్రెస్ట్ కాన్సెర్ కారకాలను కూడా చెరకు రసం నిరోధిస్తుంది. వేసవి కాలంలో ఎండ ప్రభావం వల్ల చర్మం కమిలిపోతుంది. చాలా పొడిగా మారుతుంది. అందుకే చెరకు రసం తాగడం వల్ల చర్మానికి కావల్సినంత తేమ అందుతుంది. చర్మం పొడిబారే సమస్య తీరుతుంది. ఇక కడుపులో ఏర్పడే ఎన్నో ఇన్‌ఫెక్షన్‌లను కూడా ఈ రసం నివారిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చెరకు రసంలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా తాగితే అంతే అంటున్నారు..మరీ ముఖ్యంగా స్థూలకాయులు చెరకు రసం మోతాదుకు మించి తాగకూడదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories