Vegetable: ఈ కూరగాయలను కోసిన వెంటనే వండకూడదు.. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా ?

Don’t Cook These Vegetables Immediately After Cutting: You’ll Make a Big Mistake
x

Vegetable: ఈ కూరగాయలను కోసిన వెంటనే వండకూడదు.. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా ?

Highlights

Vegetable: ప్రతి కూరగాయను వండే విధానం వేరుగా ఉంటుంది. కొన్ని కూరగాయలను కోసిన వెంటనే వండేయాలి, లేకపోతే పోషకాలు తగ్గుతాయి.

Vegetable: ప్రతి కూరగాయను వండే విధానం వేరుగా ఉంటుంది. కొన్ని కూరగాయలను కోసిన వెంటనే వండేయాలి, లేకపోతే పోషకాలు తగ్గుతాయి. కానీ కొన్ని రకాల కూరగాయలను మాత్రం కోసిన వెంటనే వండకూడదు. ఎందుకంటే, వాటిలోని ఎంజైమ్‌లు, సమ్మేళనాలు చర్య జరిపి రుచి, రంగు, పోషకాలను తగ్గిస్తాయి. ఈ నేపథ్యంలో, ఏ కూరగాయలను కోసిన వెంటనే వండకూడదో, వాటిని ఎలా వండాలో తెలుసుకుందాం.

ప్రతి వంటకం రుచిగా ఉండాలంటే ప్రతి దాన్ని ప్రత్యేక పద్ధతుల్లో వండాల్సి ఉంటుంది. తక్కువ నూనె, తక్కువ మసాలాలు వాడటం వల్ల పోషకాలు నిలుస్తాయి. అయితే, వంట చేసే విధానంతో పాటు, కూరగాయలను సిద్ధం చేసే పద్ధతి కూడా వాటి రుచి, పోషకాలపై ప్రభావం చూపుతుంది. అన్ని కూరగాయలను ఒకే విధంగా వండకూడదు. కొన్ని కూరగాయలను కోసిన వెంటనే వండటం వల్ల వాటిలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. కానీ కొన్ని రకాల కూరగాయలను కోసిన వెంటనే వండకూడదు.

బెండకాయ

కొంతమంది బెండకాయలను కోసిన వెంటనే వండుతారు. కానీ అలా చేయకూడదు. బెండకాయలో జిగురు పదార్థం ఉంటుంది. కోసిన వెంటనే వండితే అది మరింత జిగురుగా మారుతుంది. అందుకే, బెండకాయలను ముందుగా కడిగి, కోసిన తర్వాత కొంతసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల బెండకాయ కూర జిగురుగా మారదు. రుచిగా కూడా ఉంటుంది.

క్యాలీఫ్లవర్, క్యాబేజీ:

క్యాలీఫ్లవర్‌లో పురుగులు ఉంటాయని అందరికీ తెలుసు. ముఖ్యంగా క్యాలీఫ్లవర్ సీజన్ కానప్పుడు ఈ పురుగులు ఎక్కువగా ఉంటాయి. అందుకే, ముందుగా క్యాలీఫ్లవర్‌ను చిన్న ముక్కలుగా కోసి, వాటిని వేడి నీటిలో కొద్దిసేపు ఉంచి ఉడికించాలి. ఇలా చేయడం వల్ల పురుగులు, వాసన పోతాయి. క్యాబేజీలో ఉండే పురుగు కూడా మన ఆరోగ్యానికి హానికరం. అందుకే, క్యాబేజీని కోసిన తర్వాత ఉప్పు, వెనిగర్ కలిపిన నీటిలో కొంతసేపు ఉంచడం మంచిది. ఇలా చేయడం వల్ల పురుగులు తొలగిపోతాయి.

వంకాయ

వంకాయలో కూడా పురుగులు ఉండే అవకాశం ఉంది. వంకాయను కోసిన వెంటనే ఆక్సిడేషన్ వల్ల నల్లగా మారుతుంది. కోసిన వెంటనే వండితే కూర చేదుగా మారవచ్చు.. పోషకాలు కూడా తగ్గిపోవచ్చు. అందుకే, వంకాయ ముక్కలను కోసిన తర్వాత వాటిని ఉప్పు నీటిలో కొంతసేపు ఉంచడం చాలా మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories