Oily Foods: ఆయిల్‌ఫుడ్స్‌ ఎక్కువగా తినడం వల్ల అసిడిటీ వస్తుందా.. ఈ చిట్కాలు పాటించండి..!

Does Eating too Much Oily Foods Cause Acidity Follow These Tips
x

Oily Foods: ఆయిల్‌ఫుడ్స్‌ ఎక్కువగా తినడం వల్ల అసిడిటీ వస్తుందా.. ఈ చిట్కాలు పాటించండి..!

Highlights

Oily Foods: భారతదేశంలో నూనె పదార్థాలు తినే ట్రెండ్ ఎక్కువగా ఉంటుంది.

Oily Foods: భారతదేశంలో నూనె పదార్థాలు తినే ట్రెండ్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎంత రుచికరంగా ఉన్నాయో అంతే సమస్యలకి దారి తీస్తాయి. వేయించిన ఆహారాలు తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, హై బిపి, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు ముఖ్యంగా పొట్టకు సంబంధించిన ఎసిడిటీ సమస్య ఎదురవుతుంది. కొన్నిసార్లు పాత నూనెని ఆహారాన్ని వండటానికి ఉపయోగిస్తారు. ఇది జీర్ణం కావడం చాలా కష్టం. ఇది ఆమ్లత్వానికి కారణం అవుతుంది. ఎసిడిటీ సమస్యని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం.

1.వాము

అనారోగ్యకరమైన ఆహారం వల్ల మీకు అసిడిటీ ఏర్పడితే వాము మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇందుకోసం గోరు వెచ్చని నీటిలో నల్ల ఉప్పు, వాము గింజలు కలిపి తాగాలి. కొంత సమయం తర్వాత మీకు ఉపశమనం కలుగుతుంది.

2.సోంపు గింజలు

సాధారణంగా సోంపు గింజలు నేచురల్ మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. అయితే ఇది ఎసిడిటీని దూరం చేయడానికి సహాయపడుతుంది. మీరు ఒక చెంచా సోంపు గింజలని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం వడగట్టి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

3.ఇంగువ

మనం ఆహారం రుచిని పెంచడానికి ఇంగువను ఉపయోగిస్తాము. అయితే దీని ఉపయోగం ఎసిడిటీని తొలగిస్తుంది. దీని కోసం మొత్తం ఇంగువని పొడిగా చేసి ఆపై వేడి నీటిలో కలుపుకొని తాగాలి. కొంత సమయానికి మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories