అన్ని జ్వరాలు డెంగీ యేనా..?

అన్ని జ్వరాలు డెంగీ యేనా..?
x
Highlights

ఇప్పుడు చాలా మందిని జ్వరాలు పట్టి పీడుస్తున్నాయి. ఎక్కువగా డెంగ్యూ జ్వరాలు భయపెడుతున్నాయి. సాధరణ జ్యరం వచ్చినా డెంగ్యూ అని జనాలు బెంబేలేత్తున్నారు....

ఇప్పుడు చాలా మందిని జ్వరాలు పట్టి పీడుస్తున్నాయి. ఎక్కువగా డెంగ్యూ జ్వరాలు భయపెడుతున్నాయి. సాధరణ జ్యరం వచ్చినా డెంగ్యూ అని జనాలు బెంబేలేత్తున్నారు. జ్వరాలన్నీ డెంగీ కాదని వైద్యులు చెబుతున్నారు. అందుకే జ్వరం రాగానే ముందుగానే అది డెంగీ అనుకుని కంగారుపడవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దోమల బెడద, వాతావరణ మార్పుల కారణంగా వ్యాధులు ప్రభలుతున్నాయి. నిజానికి డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో, అవి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి తెలుసుకుందాం..

డెంగీ జ్వరం వస్తే టెంపరేచర్ 105 వరకు ఉంటుంది. శరీరంలో ప్రతి చోట నొప్పులు ఉంటాయి. జ్వరం ఉన్నప్పటి కంటే... తగ్గిన తర్వాతే డెంగీ లక్షణాలు కనిపిస్తాయి. శరీరంపై ఎర్రటి మచ్చలు రావడం, ప్లేట్ లెట్స్ క్రమంగా పడిపోతుండడం, బీపీ తగ్గడం లాంటివి వస్తుంటాయి. అలాంటప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్లేట్ లెట్స్ పెరగడానికి ఉపయోగపడే ఆహారం తీసుకుంటుడాలి. ఒంటి మీద మచ్చలు తీవ్రంగా ఉన్నా.. కాళ్లూ చేతులు చల్లబడుతున్నా..నొప్పి వస్తున్నా, వాంతులు ఎక్కువ అవుతున్నా వెంటనే డాక్టర్ సంప్రందించాలి.

జ్వరాలు వచ్చిన వెంటనే డాక్టర్లను సంప్రందించాలి. అది ఎలాంటి జ్వరమో ముందుగానే గుర్తించాలి. అలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఎంత తొందరగా వైద్యులను సంప్రదిస్తే అంత మంచిది. వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories