Health Tips: చెమట విపరీతంగా పడుతోందా.. అయితే డైట్‌లో ఈ మార్పులు చేయండి..!

Health Tips: చెమట విపరీతంగా పడుతోందా.. అయితే డైట్‌లో ఈ మార్పులు చేయండి..!
Health Tips: చెమట పట్టడం అనేది సాధారణంగా ప్రతి ఒక్కరిలో జరిగే ప్రక్రియే. అయినప్పటికీ కొంతమందికి సాధారణం కంటే ఎక్కువగా చెమటలు పడుతాయి.
Health Tips: చెమట పట్టడం అనేది సాధారణంగా ప్రతి ఒక్కరిలో జరిగే ప్రక్రియే. అయినప్పటికీ కొంతమందికి సాధారణం కంటే ఎక్కువగా చెమటలు పడుతాయి. అయితే ఇది మామూలు విషయం కాదు. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. అధిక బరువు, బీపీ, మధుమేహం వంటి సమస్యలు దీని వెనుక ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మీరు ఈ సమస్యతో సతమతమవుతుంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. చెమట సమస్యను తగ్గించే కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినండి
ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం అవసరం. అదేవిధంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కాల్షియం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. ఇందుకోసం పాలు, పెరుగు, నువ్వులని డైట్‌లో చేర్చాలి.
అవిసె గింజలు
అవిసె గింజల ప్రయోజనాల గురించి మీరు తప్పక వినే ఉంటారు. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గించడం నుంచి బరువు తగ్గించడం వరకు ఉపయోగపడుతుంది. మీరు మీ శరీరం నుంచి ఎక్కువ చెమటని ఎదుర్కొంటున్నట్లయితే అవిసెగింజలు డైట్‌లో చేర్చుకోవాలి.
తగినంత నీరు తాగాలి
విపరీతమైన చెమట సమస్యతో బాధపడేవారు తగినంత నీరు తాగాలి. శరీరాన్ని నీటితో హైడ్రేట్ గా ఉంచాలి. దీని కారణంగా చెమట సమస్య తగ్గుతుంది. రోజుకు 7 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి.
స్పైసీ ఫుడ్ మానుకోండి
చెమట సమస్యను నివారించడానికి మీరు తక్కువ స్పైసీ ఫుడ్ తినాలి. లేదంటే అసలు మానుకోవాలి. కెఫిన్ తీసుకోవడం తగ్గించండి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక చెమట పడుతుంది. ఎండలో తక్కువగా తిరగండి.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
Health Tips: తొందరగా అలసిపోతున్నారా.. ఈ జ్యూస్లని డైట్‌లో...
12 Aug 2022 10:30 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్...
12 Aug 2022 9:55 AM GMTCM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక...
12 Aug 2022 9:43 AM GMTMacherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ..
12 Aug 2022 9:29 AM GMTమునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..
12 Aug 2022 8:38 AM GMT