Milk : పాలు తాగిన వెంటనే ఈ ఆహారాలు తింటున్నారా? అయితే, అనారోగ్యం పాలవడం ఖాయం

Do You Drink Milk and Then Eat This? You Must Read This Story
x

Milk : పాలు తాగిన వెంటనే ఈ ఆహారాలు తింటున్నారా? అయితే, అనారోగ్యం పాలవడం ఖాయం

Highlights

Milk : పాలు తాగిన వెంటనే ఈ ఆహారాలు తింటున్నారా? అయితే, అనారోగ్యం పాలవడం ఖాయం

Milk : పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. పాలలో కాల్షియం, ప్రొటీన్లు, అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అయితే, పాలను సరైన పద్ధతిలో, సరైన సమయంలో తీసుకుంటేనే దాని ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా పాలు తాగిన వెంటనే కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఆరోగ్య నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం పాలు తాగిన తర్వాత ఏయే ఆహారాలు తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

పాలు తాగిన వెంటనే తినకూడని ఆహారాలు

1. మసాలా, ఉప్పు పదార్థాలు: పాలు తాగిన తర్వాత వెంటనే చిప్స్, కారంగా ఉండే బిస్కెట్లు, ఫాస్ట్ ఫుడ్ లేదా ఇతర మసాలా పదార్థాలు తినడం చాలామందికి అలవాటు. ఇలా చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. పాలు తాగిన వెంటనే ఉప్పు, మసాలా పదార్థాలు తినడం మానుకోవాలి.

2. చేపలు: చేపలు కూడా చాలా ఆరోగ్యకరమైన ఆహారమే. కానీ, పాలను, చేపలను ఒకేసారి లేదా వెంటనే తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తి, కడుపు నొప్పికి దారితీసే అవకాశం ఉంది.

3. పుల్లని పండ్లు (సిట్రస్ ఫ్రూట్స్): నారింజ, నిమ్మ వంటి పుల్లని పండ్లలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. పాలు తాగిన వెంటనే ఇలాంటి పుల్లని పండ్లను తింటే, పాలలో ఉండే ప్రొటీన్ గడ్డ కట్టే అవకాశం ఉంది. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం, మరియు కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. పాలు తాగిన 2-3 గంటల తర్వాత మాత్రమే పండ్లను తినడం ఉత్తమం.

4. బెల్లం: బెల్లం కలిపిన పాలు ఆరోగ్యానికి మంచిదే అని చాలామంది అనుకుంటారు. అయితే, నాణ్యత లేని, ఉప్పు ఎక్కువగా ఉండే బెల్లాన్ని పాలలో కలిపితే జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, పాలలో బెల్లం కలిపేటప్పుడు దాని నాణ్యతను తప్పకుండా గమనించాలి.

5. పుచ్చకాయ : పాలు తాగిన తర్వాత పుచ్చకాయ తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. పాలలో ఉండే ప్రొటీన్లు పుచ్చకాయలోని ఆమ్లంతో కలిసినప్పుడు జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. ఇది కడుపు నొప్పి మరియు అజీర్ణం వంటి సమస్యలను పెంచుతుంది.

మనం ఎప్పుడు పాలు తాగాలి?

పాలను ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. అయితే, పైన చెప్పిన విధంగా పాలు తాగిన తర్వాత కొన్ని గంటల పాటు ఎలాంటి పదార్థాలు తీసుకోకుండా జాగ్రత్త వహించడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories