Health Tips: పొరపాటున ఈ తప్పులు చేయకండి.. ఎముకల పని ముగిసినట్లే..!

Do not Make These Mistakes by Mistake Bones Become Weak
x

Health Tips: పొరపాటున ఈ తప్పులు చేయకండి.. ఎముకల పని ముగిసినట్లే..!

Highlights

Health Tips: మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు చేతులు, పాదాలు, కీళ్లలో నొప్పిగా అనిపిస్తుందా.. అప్పుడు ఎముకలు బలహీనమవుతున్నాయని అర్థం.

Health Tips: మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు చేతులు, పాదాలు, కీళ్లలో నొప్పిగా అనిపిస్తుందా.. అప్పుడు ఎముకలు బలహీనమవుతున్నాయని అర్థం. చెడ్డ జీవనశైలి కారణంగా కీళ్ల నొప్పులకు సంబంధించిన సమస్య ప్రజలలో పెరుగుతోంది. ఇంతకు ముందు 50 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి యువకుల వరకు ఈ సమస్య కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో మీకు ఇటువంటి పరిస్థితులని ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే ఈ చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండండి. అవేంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మీరు ధూమపానం, మద్యం సేవించినట్లయితే వెంటనే ఈ రెండింటిని తీసుకోవడం మానేయాలి. నిజానికి ఈ రెండు నేరుగా ఎముకలను బలహీనం చేయడానికి పని చేస్తాయి. ఇది శరీరంలోని ఊపిరితిత్తులు, మూత్రపిండాలను ప్రభావితం చేయడమే కాకుండా ఎముకలని బలహీనపరుస్తాయి. అందువల్ల ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది. మంచి ఆరోగ్యానికి తగినంత నిద్ర, సరైన శారీరక శ్రమ అవసరం.

అదికాకుండా మొబైల్‌ చూస్తూ గంటల తరబడి బెడ్‌పై పడుకుంటే ఎముకలు బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. నిజానికి బలమైన ఎముకలకు సరైన నిద్ర, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం అవసరం. ఇలా చేయకపోతే ఎముకలు వీక్‌ అవుతాయి. చాలా మంది ప్రజలు రాత్రి షిఫ్టులు పనిచేసి పగటిపూట నిద్రపోతారు. ఈ పరిస్థితిలో వారికి తగినంత సూర్యరశ్మి అందదు. ఈ కిరణాలు విటమిన్ డి ని అందిస్తాయి. ఇది శరీరంలో కాల్షియం లోపాన్ని తొలగిస్తుంది. శరీరంలో క్యాల్షియం సరైన మోతాదులో ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కీళ్లలో నొప్పి ఉండదు. ఈ పరిస్థితిలో వీలైతే రాత్రి షిఫ్ట్ ముగిసిన తర్వాత ఎముకలు ఫిట్‌గా ఉండటానికి అరగంట పాటు ఎండలో తిరిగితే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories