చాక్లేట్ తింటే మతిమరుపు మాయం!

చాక్లేట్ తింటే మతిమరుపు మాయం!
x
Highlights

చాక్లేట్ తింటే మతిమరుపు మాయం! చాక్లేట్ తింటే మతిమరుపు మాయం!

నాటి యుగంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలలో మానసిక పరమైనవే ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా చాలా మందిని మతిమరుపు సమస్య వేధిస్తోంది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందర్ని ఈ సమస్య పట్టిపీడిస్తోంది. అయితే దీనికి విరుగుడుగా ఓ సులభమైన పద్దతిని పరిశోధకులు కనుగొన్నారు. అది ఏమిటంటే ప్రతి రోజు చాక్లెట్స్ తినాలంటా...

మతిమరుపును దూరం చేసుకోవాలనుకుంటే రోజూ చాక్లెట్లు తప్పనిసరిగా తీనాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచి ఆహారంతో పాటు చాక్లెట్ కూడా డైట్‌లో బాగంగా ఉండాలని వైద్యులు వివరిస్తున్నారు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్‌లో వుండే పాలీ ఫెనాల్స్ చర్మానికి. గుండె కణాలకు హాని చేసే రసాయనాలను నివారిస్తాయంటున్నారు వైద్యులు. చాక్లెట్ తినడం వల్ల దంతాలు పాడైపోతాయని చాలా మందిలో అపోహ ఉంటుంది. కానీ మనం తినే చాక్లెట్ నోట్లోనే కరిగిపోతుంది కావున అది దంతాలకు హానీ చేసే అస్కారం ఉండదు.

అలాగే చాక్లెట్స్‌లో అరోగ్యానికి మేలు చేసే గుణాలు చాలనే ఉన్నాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ విషయాన్ని బ్రిటీష్ డైటిక్ అసోసియేషన్ స్నష్టం చేసింది. మరి ముఖ్యంగా మిల్క్ చాక్లెట్‌లలో కాల్షియం, విటమిన్ బి2, బి12 పుష్కలంగా వుంటాయని, అలాగే డార్క్ చాక్లెట్‌లలో మెగ్నీషియం, రాగి, ఇనుములాంటివి సమ‌ృద్దిగా లభిస్తాయని అవి శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయని వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories