Curd Combination: వేసవిలో పెరుగుతో పాటు ఇవి తింటున్నారా.. కాస్త ఆలోచించండి..!

Do Not Eat These Foods Along With Curd in Summer Very Dangerous
x

Curd Combination: వేసవిలో పెరుగుతో పాటు ఇవి తింటున్నారా.. కాస్త ఆలోచించండి..!

Highlights

Curd Combination: వేసవిలో పొట్టని చల్లగా ఉంచడానికి చాలామంది చల్లటి ఆహారాల కోసం వెతుకుతారు.

Curd Combination: వేసవిలో పొట్టని చల్లగా ఉంచడానికి చాలామంది చల్లటి ఆహారాల కోసం వెతుకుతారు. అయితే ఇందులో ముఖ్యమైనది అంతేకాకుండా అందరికి లభించేది పెరుగు మాత్రమే. దీనిని తీసకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపాన్ని కూడా సరిచేయవచ్చు. అలాగే కడుపుకు చల్లదనాన్ని అందించవచ్చు. పెరుగు జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. పెరుగు తినడం వల్ల కలిగే లాభాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అయినప్పటికీ పెరుగుతో పాటు కొన్ని ఆహారాలని కలిపి తినకూడదు. అలాంటి ఆహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. పెరుగు, చేప

కొంతమంది చేపలకూరతో ఆహారం తిన్నాక పెరుగుని తింటారు. ఇలా అస్సలు చేయకూడదు. పెరుగును చేపలతో ఎప్పుడూ తినకూడదని గుర్తుంచుకోండి. నిజానికి పెరుగు, చేప రెండూ ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు. వీటిని కలిపి తింటే అజీర్ణం, జీర్ణకోశ సమస్యలు ఎదురవుతాయి. అలాగే చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెరుగుతో కలిపి తీసుకుంటే చర్మ సమస్యలు ఏర్పడుతాయి.

2. వేయించిన ఆహారం, పెరుగు

వేయించిన ఆహార పదార్థాలతో పెరుగుని ఎప్పుడు తినకూడదు. ఇది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఇది చెడు ఆహార కలయిక. పెరుగుతో పాటు వేయించిన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణక్రియలో సమస్యలు ఎదురవుతాయి. ఈ రెండింటినీ కలిపి తింటే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

3. పెరుగు, ఉల్లిపాయ

చాలా మంది గ్రామాలలో రైతులు పెరుగు-ఉల్లిపాయలను తినడానికి ఇష్టపడతారు. అయితే పెరుగు ఉల్లిపాయ అనేది ఒక చెడ్డ ఆహార కలయిక. దీనివల్ల అనేక ఉదర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆమ్లత్వం, వాంతులు, తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు ఏర్పడుతాయి.

4. పాలు, పెరుగు

పాలు, పెరుగు కలిపి ఎప్పుడు తీసుకోకూడదు. ఈ రెండూ ఒకే రకమైన జంతు ప్రోటీన్ నుంచి తయారవుతాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల విరేచనాలు, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి.

5. పెరుగు, మామిడి

వేసవిలో ప్రజలు మామిడిపండ్లను అధికంగా తింటారు. చల్లటి మామిడి షేక్ తాగుతారు. అయితే పెరుగుతో పాటు మామిడిపండ్లని, మామిడి షేక్‌ని తీసుకోకూడదని గుర్తుంచుకోండి. ఇది చెడు ఫుడ్ కాంబినేషన్. పొరపాటున కూడా పెరుగుతో మామిడిని తినకూడదు. ఈ రెండింటి ప్రభావాలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories