Health: కొబ్బరి నీళ్లు తాగుతున్నారా? ఓసారి ఆలోచించుకోవాల్సిందే

Health: కొబ్బరి నీళ్లు తాగుతున్నారా? ఓసారి ఆలోచించుకోవాల్సిందే
x
Highlights

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు శక్తిని అందిస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు,...

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు శక్తిని అందిస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం అధికంగా లభిస్తాయి. అయితే కొందరు నిపుణులు మాత్రం కొబ్బరి నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. కొన్ని రకాల సమస్యలతో బాధపడే వారు కొబ్బరి నీళ్లను తీసుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డయాబెటిస్ బాధితులు..

కొబ్బరి నీళ్లలో నేచురల్‌ షుగర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ పేషెంట్స్‌పై ప్రభావ చూపుతుంది. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే, షుగర్ వ్యాధిగ్రస్తులు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.

కిడ్నీ సమస్యలు..

కొబ్బరి నీళ్లలో అధికంగా ఉండే పొటాషియం మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడే వారిలో అదనపు పొటాషియంను శరీరం నుంచి సరిగా తొలగించలేదు. దీని వల్ల కండరాల బలహీనత, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి, మూత్రపిండ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తీసుకునే ముందు వైద్యుల సూచనలు పాటించాలి.

లోబీపీ..

కొబ్బరి నీళ్లు అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే, ఇప్పటికే రక్తపోటు తక్కువగా (లోబీపీ) ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగితే మరింత రక్తపోటు తగ్గే ప్రమాదం ఉంటుంది. దీని ప్రభావంతో అలసట, తలతిరడం, మూర్ఛపోవడం వంటి సమస్యలు రావచ్చు.

ఆపరేషన్స్‌కు ముందు..

శస్త్రచికిత్స చేయించుకోబోతున్నవారు కొంతకాలం ముందే కొబ్బరి నీళ్లు తాగడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు శరీర రక్తపోటు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. శస్త్రచికిత్స సమయంలో లేదా తర్వాత ఇది సమస్యలను పెంచే అవకాశం ఉంది. అందువల్ల డాక్టర్ సూచనల ప్రకారం కొబ్బరి నీళ్లు తాగడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories