Health: చక్కెర మాత్రమే కాదు.. షుగర్‌ పేషెంట్స్‌ వీటికి కూడా దూరంగా ఉండాలి..!

Health: చక్కెర మాత్రమే కాదు.. షుగర్‌ పేషెంట్స్‌ వీటికి కూడా దూరంగా ఉండాలి..!
x
Highlights

Health: రోజురోజుకీ షుగర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. మారిన జీవన విధానం కారణంగా ఇటీవల ఎక్కువ మంది డయాబెటిస్‌ సమస్య బారిన పడుతున్నారు.

Health: రోజురోజుకీ షుగర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. మారిన జీవన విధానం కారణంగా ఇటీవల ఎక్కువ మంది డయాబెటిస్‌ సమస్య బారిన పడుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్‌ బారిన పడితే జీవనశైలిలో పూర్తిగా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. తీసుకునే ఆహారం మొదలు జీవన విధానం మారాలి. అయితే చాలా మంది షుగర్ పేషెంట్స్‌ కేవలం చక్కెర ఒక్కటే వ్యాధిని ప్రభావితం చేస్తుందని భావిస్తుంటారు. నిజానికి చక్కెరతో పాటు మరికొన్ని ఫుడ్స్‌కు కూడా వీరు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

షుగర్ పేషెంట్స్ వైట్‌ రైస్‌కు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. వైట్‌ రైస్‌ రుచికి తియ్యగా లేకపోయినా ఎక్కువగా తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే షుగర్‌ పేషెంట్స్‌ రాత్రుళ్లు అన్నం తినకూడదని నిపుణులు చెబుతుంటారు. డయాబెటిస్‌తో బాధపడేవారు బంగాళదుంపలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని స్టార్చ్‌ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రేరేపిస్తాయి. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే బంగళాదుం షుగర్‌ పేషెంట్స్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

పిండి రక్తంలో చక్కెర స్థాయిని బాగా పెంచుతుంది. అందుకే షుగర్‌ పేషెంట్స్‌ బ్రెడ్‌, బిస్కెట్స్‌, పిస్తా వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతాయి. ఎక్కువగా వేయించిన ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. నూనెలో ఎక్కువగా వేయించిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడంతో పాటు మలబద్ధకానికి కూడా కారణమౌతోంది.

డయాబెటిస్‌ పేషెంట్స్‌ కొన్ని రకాల పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. అయితే,ప్యాకింగ్‌ చేసిన ఫ్రూట్ జ్యూస్‌లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఇందులో కలిపే కలర్స్‌, ప్రిజర్వేటివ్‌లు, రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే మార్కెట్లో లభించే పండ్ల జ్యూస్‌లకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories