Dates Benefits: ఖర్జూరంతో ఆ సమస్య నయమవుతుంది..!

Dates Benefits Increase the Fertility Potential of Males
x

Dates Benefits: ఖర్జూరంతో ఆ సమస్య నయమవుతుంది..!

Highlights

Dates Benefits: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే బలవర్దకమైన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.

Dates Benefits: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే బలవర్దకమైన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. శక్తివంతమైన ఆహారాలలో ఖర్జూర ఒకటి. ఇందులో పోషకాలు పుష్కలం. ఖర్జూరంతో అన్ని రోగాలు నయమవుతాయని వైద్య నిపుణులు చెబుతారు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఖర్జూరాన్ని మించింది లేనేలేదు. ముఖ్యంగా మగవారికి ఖర్జూరం పండ్లు ప్రత్యేక లాభాన్ని కలిగిస్తాయి.

మగవారిలో ఉండే సంతాన సాఫల్యత సామర్ధ్యాన్ని ఖర్జూరం పెంచుతుంది. అంటే సంతాన సాఫల్యత లేకపోవడానికి ప్రధాన కారణం స్పెర్మ్ కౌంట్ లేదా స్పెర్మ్ మొటిలిటీ. ఈ రెండూ ఖర్జూరం ద్వారా మెరుగుపడతాయి. ప్రతిరోజూ పాలతో కలిపి ఖర్జూరం తీసుకుంటే మగవారిలో ఫెటిలిటీ పెరుగుతుంది. రోజూ 2-3 ఖర్జూరం పండ్లు పాలలో ఉడికించి తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం బాడీలో షుగర్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. ఫలితంగా డయాబెటిస్ సమస్య నుంచి కూడా దూరం కావచ్చు.

ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది. దీనిని అధిగమించడానికి ఖర్జూర సూపర్‌గా పనిచేస్తుంది. మీరు పాలలో నానబెట్టిన ఖర్జూర తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య క్రమంగా నయమవుతుంది. ఖర్జూరం తల్లి ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాక, పిండం అభివృద్ధికి కూడా ఉపయోగపడతాయి. ఆవు పాలలో నానబెట్టిన ఖర్జూర తింటే శరీరంలో ఆక్సిటోసిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది డెలివరీ సమయంలో గర్భాశయం సున్నితత్వాన్ని పెంచడానికి పనిచేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories