Cucumber Benefits: అల్సర్స్ కు చెక్ పెట్టే కీర దోసకాయ

Cucumber Benefits for Skin, Hair
x

Cucumber (ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

Cucumber Benefits: రోజూ నాలుగు కీరదోసముక్కలు తినడం వల్ల ఎసిడిటీ, అల్సర్సను నివారిస్తుంది.

Cucumber Benefits: మండు వేసవి రోజుల్లో కరకరలాడే చల్ల చల్లని కీర దోసకాయను తినడం ఎవరికి ఇష్టం వుండదు చెప్పండి. దీనిలో 90-96 శాతం నీటిని కలిగి వుండడతో పాటు పరిమితంగా కేలరీల్ని, కొవ్వులు, కొలెస్ట్రాల్, మరియు సోడియం కలిగి వుంటుంది. ఎండాకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే ఈ కీరా ఆరోగ్యానికే కాదు... అందాన్ని పెంచడంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే ఎండాకాలంలో అందరూ దీన్నినేరుగా తీసుకోవడంతో పాటు సలాడ్స్ లోనూ ఉపయోగిస్తూ వుంటారు. మరి కీర లో వుండే ఆరోగ్యప్రయోగజనాలేంటో మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం.

రోజూ నాలుగు కీరదోసముక్కలు తినడం వల్ల ఎసిడిటీ, అల్సర్సను నివారిస్తుంది. పొట్టకు చల్లదనం అందిస్తుంది. కీరదోసలో ఉండే ఆల్కనిటి స్టొమక్ అల్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. రెండు గ్లాసులు కీరదోస జ్యూస్ తాగడం వల్ల ఇది స్టొమక్ అల్సర్ నివారిస్తుంది. కీరాలో ఎక్కువగా ఉండే విటమిన్ కె మనం తీసుకున్న ఆహారం నుంచి శరీరం ఎక్కువ మొత్తంలో క్యాల్షియం గ్రహించేలా చేస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి. దీనిలో వుండే బి విటమిన్ అడ్రినల్ గ్రంథి పనితీరు మెరుపరుస్తుంది. దీంతో ఒత్తిడి వల్ల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలుగకుండా కాపాడుతుంది.

కీరదోసకాయలో దాదాపు96శాతం వరకు నీరు వుంటుంది. ఎండాకాలంలో శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటికి వెళ్లి పోతుంది. అలాంటి టైంలో కీర దోస బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కలిగించడంలో కూడా కీరా ముఖ్యపాత్ర పోషిస్తుంది.సాధారణంగా కీరా దోసకాయ తినేటప్పుడు ప్రతి ఒక్కరు తొక్కను తీసి తింటారు. తొక్క తీసి వేయడం వల్ల దానిపై చేరిన వాతావరణ కాలుష్య పదార్థాలు తొలగిపోతాయి. అయితే వీటితో పాటుగా ఎన్నో అత్యవసర పోషకాలు కూడా తొలగిపోతాయి. అలాకాకుండా కొంచెం నీటిలో ఉప్పు వేసి కీరదోసని కాసేపు ఆ నీటిలో ఉంచి శుభ్రంగా కడిగి తొక్కతో సహా కీరదోసని తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

చర్మఆరోగ్యానికి తోడ్పడే పొటాషియం, మెగ్నీషియం, సిలికాన్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. సో స్కిన్ బ్యూటీ ట్రీట్మెంట్లలో కీరాను ఉపయోగిస్తుంటారు. అంతే కాదండోయ్ చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. ఇంకా అనేక రకాలుగా పని చేసే కీరా దోసకాను మన రెగ్యులర్ ఆహరంలో చేర్చుకుంటే సరి. ఇంకెందుకు ఆలస్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories